NV Ramana Visited Jallianwala Bagh: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి. రమణ.. పంజాబ్‌లో పర్యటించారు. సతీసమేతంగా అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌కు వెళ్లారు. అక్కడి మ్యూజియంను సందర్శించారు. అధికారులను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. జలియన్‌వాలా బాగ్ ఊచకోత భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఓ మరిచిపోలేని దుర్ఘటన. బ్రిటీష్ దురహంకారానికి 500 మందికిపైగా ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటన జరిగి ఏప్రిల్ 13కు 103 ఏళ్లు పూర్తయ్యాయి.
జలియన్‌వాలా బాగ్ అంటే..?బాగ్ అంటే తోట! పేరులో జలియన్‌వాలా బాగ్ అని ఉన్నా.. తోట ఏమీ లేదక్కడ. 225 x 180 మీటర్ల ప్రైవేటు వ్యక్తుల స్థలమిది. జల్లా గ్రామంలోని 34 మందికి మహారాజా రంజిత్‌సింగ్ దాన్ని దానమిచ్చారు! అందుకే మొదట దీన్ని జల్లావాలాగా పిలిచేవారు. కాలక్రమంలో జలియన్‌వాలా బాగ్‌గా మారింది. చుట్టూ ఇళ్లుండి మధ్యలో ఖాళీగా ఉన్న స్థలమది. ఇళ్ల మధ్య నుంచే సన్నటి దారి ఉంటుందీ స్థలంలోకి!