తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీనేజర్లకు కరోనా టీకా​.. తొలి రోజు ఎంతమందికి అంటే... - vaccine expiry news

Children Vaccination Update: 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉండేవారికి టీకా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. తొలి రోజున రాత్రి 7 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 37. 84 లక్షల మందికిపైగా పిల్లలకు టీకా వేసినట్లు కేంద్రం తెలిపింది.

CHIDLREN VACCINE UPDATE
పిల్లల వ్యాక్సినేషన్

By

Published : Jan 3, 2022, 6:35 PM IST

Updated : Jan 3, 2022, 7:08 PM IST

Children Vaccination Update: కరోనా వైరస్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా సోమవారం 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉండేవారికి టీకా పంపిణీని ప్రారంభించింది. తొలి రోజున రాత్రి 7 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు 37.84 లక్షల మందికి పైగా పిల్లలకు టీకా మొదటి డోసును అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

తొలి డోసు టీకా తీసుకుంటున్న విద్యార్థిని
తొలి రోజు టీకాకు హాజరైన విద్యార్థినులు
టీకా తీసుకునేందుకు వచ్చిన టీనేజర్లు

పిల్లల వ్యాకినేషన్​ గురించి తెలసుకునేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా క్షేత్రస్థాయిలో పర్యటించారు. దిల్లీలోని ఆర్​ఎంఎల్​ ఆసుపత్రికి చేరుకుని టీకా తీసుకునేందుకు వచ్చిన పిల్లలతో మాట్లాడారు. వ్యాక్సినేషన్​లో భాగం అయ్యేలా తోటి స్నేహితులను కూడా ప్రోత్సహించాలని అక్కడికి వచ్చిన పిల్లలకు మంత్రి సూచించారు.

టీకా మొదటి డోసు
వ్యాక్సిన్​ కోసం ఎదురు చూస్తున్న టీనేజర్లు

టీనేజర్లకు ఇచ్చే టీకా కోసం సుమారు 39.88 లక్షల మంది పిల్లలు ముందస్తుగా కొవిన్ పోర్టల్​లో నమోదు చేసున్నట్లు అధికారులు తెలిపారు.

వ్యాక్సిన్​ తీసుకునేందుకు వచ్చి టీనేజర్లు

vaccine expiry news

ఆ వార్తలు అవాస్తవం..

మరోవైపు.. దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో ఎక్స్​పైర్​ అయిన టీకాలను పంపిణీ చేస్తున్నారంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. కరోనా పై పనిచేసే కొవాగ్జిన్​ టీకా సామర్థ్యాన్ని 9 నెలల నుంచి 12 నెలలకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్​సీఓ) పెంచిన విషయాన్ని గుర్తు చేసింది. కొవిషీల్డ్​ పనిచేసే సామర్థ్యాన్ని 6 నుంచి 9 నెలలకు పొడిగించినట్లు పేర్కొంది. వ్యాక్సిన్​లో పనితీరును బట్టి టీకాలు ఎన్ని నెలలు పని చేస్తాయనేది సీడీఎస్​సీఓ అంచనా వేస్తుందని పేర్కొంది.

biometric attendance for employees

అప్పటి వరకు బయోమెట్రిక్​ హాజరు లేనట్టే..

దేశంలో కరోనా కేసులు పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని బయోమెట్రిక్​ హాజరును ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు మినహా ఇస్తున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

'81% కేసులు ఒమిక్రాన్​వే'.. సాధారణ జ్వరంలాంటిదేనన్న సీఎం!

సీఎంను కలిసేందుకు వచ్చిన వారిలో 14 మందికి కరోనా

Last Updated : Jan 3, 2022, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details