తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అభివృద్ధి పేరుతో తమిళ ప్రజలకు మోసం' - పీ చిదంబరం

ఐరాసలో శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై జరిగిన ఓటింగ్​లో భారత్​ దూరంగా ఉండటాన్ని తప్పుపట్టారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం. అభివృద్ధి పేరుతో తమిళ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు.

Chidambaram attacks Centre for abstaining from voting on UNHRC resolution against Sri Lanka
'అభివృద్ధి పేరుతో తమిళ ప్రజలకు మోసం'

By

Published : Mar 24, 2021, 2:04 PM IST

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్​హెచ్ఆర్​సీ)లో శ్రీలంకకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్​కు భారత్​ దూరంగా ఉండటంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరం. తమిళనాడులో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఏఐఏడీఎంకే-భాజపా కూటమికి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలను కోరారు. అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు.

"యూఎన్​హెచ్​ఆర్​సీలో శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్​లో భారత్​ దూరంగా ఉంది. ఇది తమిళ ప్రజలకు చేసిన మోసం. తమిళ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ఏఐఏడీఎంకే-భాజపా కూటమికి తగిన శిక్ష విధించాలి" అని వరుస ట్వీట్​లు​ చేశారు చిదంబరం.

ఆ ఓటింగ్​లో భారత ప్రతినిధులను దూరంగా ఉండాలని బలవంతం చేసినట్లయితే విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు కేంద్ర మాజీ మంత్రి.

ఇదీ చూడండి:యూఎన్​హెచ్​ఆర్​సీలో లంకకు వ్యతిరేకంగా తీర్మానం

ABOUT THE AUTHOR

...view details