తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రక్తదానం చేసిన వారికి 2కిలోల చికెన్, అరకిలో పనీర్​'

Chicken and panner for blood donors: రక్తదాతలను ప్రోత్సహించేందుకుగాను ఓ రక్తదాన శిబిర నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. రక్తదాతలకు చికెన్​, పనీర్ అందించారు. ఈ కార్యక్రమంలో చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

Chicken and panner for blood donors:
రక్తదాతలకు చికెన్ పనీర్​

By

Published : Dec 13, 2021, 8:01 AM IST

'రక్తదానం చేయండి.. చికెన్, పనీర్​ అందుకోండి'

Chicken and panner for blood donors: 'అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో గొప్పది' అంటూ ఉంటారు. మనం చేసే రక్తదానంతో ఇతరులకు కొత్త జీవితాలు అందుతాయి. మరి అంతటి విలువైన రక్తాన్ని దానం చేసేవారిని ప్రోత్సహించేందుకుగాను మహారాష్ట్రలో ఓ రక్తదాన శిబిర నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. రక్తదాతలు నాన్​ వెజిటేరియన్ అయితే వారికి 2కిలోల చికెన్ అందించారు. వెజిటేరియన్ అయితే.. అర్ధకిలో పనీర్ అందించారు.

రక్తదానం చేస్తున్న యువకుడు

Blood shortage in maharashtra: కరోనా కారణంగా రక్తదాతలు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల మహారాష్ట్రలో తీవ్ర రక్త కొరత ఏర్పడింది. ఫలితంగా వివిధ వ్యాధులతో బాధపడే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని, ప్రజలంతా స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మహారాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఎన్​సీపీ చీఫ్ శరద్​ పవార్ పుట్టినరోజును పురస్కరించుకుని పుణెలోని కోథ్​రూడ్​ ప్రాంతంలో మాజీ కార్పొరేటర్ శంకర్ కేమ్​సే ఓ రక్తదాన శబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానం చేసినవారికి ఆయన చికెన్, పనీర్ అందజేశారు. కార్యక్రమంలో చాలా మంది యువతీయవకులు ఉత్సాహంగా పాల్గొని తమ రక్తాన్ని దానం చేశారు.

యువతికి చికెన్ అందిస్తున్న నిర్వాహకులు

ఈ కార్యక్రమం ద్వారా 350 బ్యాగుల రక్తాన్ని తాము సేకరించామని నిర్వాహకుడు శంకర్ కెమ్​సే తెలిపారు.

యువకుడికి పనీర్ అందిస్తున్న మాజీ కార్పొరేటర్​ శంకర్ కేమ్​సె

ఇదీ చూడండి:కాంక్రీట్ మిక్సర్​తో పిండి కలిపి వంటలు.. 2లక్షల మందికి అన్నదానం!

ఇదీ చూడండి:'మారడోనా వాచ్ మాత్రమే కాదు.. చాలా వస్తువులు కొట్టుకొచ్చాడు!'

ABOUT THE AUTHOR

...view details