తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకప్పుడు ప్యూన్.. ఇప్పుడు రెండు ఐటీ కంపెనీలకు బాస్.. రూ.కోట్ల టర్నోవర్! - చోటు శర్మ వీడియో

ప్యూన్​గా తన జీవితాన్ని మొదలు పెట్టి.. ఇప్పుడు రెండు ఐటీ కంపెనీలకు బాస్​గా ఎదిగారు ఓ వ్యక్తి. రూ.10 కోట్ల టర్నోవర్​ను సాధించి.. వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. అలా ఎదగడానికి ఆయన పడిన కష్టమేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.

chhotu sharma chandigarh
chhotu sharma chandigarh

By

Published : Apr 6, 2023, 7:05 PM IST

కొన్ని సంవత్సరాల క్రితం ఆయనొక ప్యూన్.. ఆఫీస్‌లో అందరికీ ఫైళ్లు అందిస్తూ సాధారణ జీవితం గడిపేవారు. ఓవైపు పనిచేస్తూనే మరోవైపు.. కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నారు. కట్‌ చేస్తే ఆ వ్యక్తి ఇప్పుడు రూ.10కోట్ల టర్నోవర్‌ ఉన్న రెండు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు బాస్ అయ్యారు. కథ ఇంట్రెస్టింగ్​గా ఉంది కదా! ఆయన ఈ స్థాయికి ఎలా చేరుకున్నారో చూద్దాం రండి!!

చోటు శర్మ

పై చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు చోటు శర్మ. స్వస్థలం హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రా జిల్లాలోని ఓ చిన్న గ్రామం. 1998లో డిగ్రీ పూర్తి చేసిన చోటు శర్మ.. కంప్యూటర్‌ కోర్సు చేయాలనే కోరిక ఉండేది. అయితే అందుకు ఆయన దగ్గర సరిపడా డబ్బులు లేవు. అందుకే ఓ కంప్యూటర్ సెంటర్‌లో ప్యూన్‌గా చేరారు. పార్ట్‌టైమ్ పనిచేస్తూనే కంప్యూటర్ కోర్సు నేర్చుకుని గుర్తింపు పొందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఎదిగారు.

2000 సంవత్సరంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మారిన చోటు శర్మ.. తాను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరలేదు. దీంతో కొంత మందికి కంప్యూటర్ క్లాసులు చెప్పడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని సొంత కంప్యూటర్ సెంటర్ ప్రారంభించారు. కేవలం 6 నెలల్లోనే 80 మంది అందులో చేరారు. అందులోని చాలా మంది విద్యార్థులు రూ.500 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.

ఇన్​స్టిట్యూట్​లో విద్యార్థులతో కలిసి చోటు శర్మ

క్రమంగా ఎదిగిన చోటు శర్మ.. 2007లో CS ఇన్ఫోటెక్, CS సాఫ్ట్‌ సొల్యూషన్స్‌ పేరుతో రెండు కంపెనీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చోటు శర్మ కంపెనీల టర్నోవర్ రూ.10కోట్లకు పైనే ఉంది. పంజాబ్‌లోని మొహాలీలో 1800 మందికి పైగా ఉపాధి కల్పించేలా ఒక పెద్ద సంస్థను నెలకొల్పేందుకు చోటు శర్మ ప్రయత్నాలు చేస్తున్నారు. చోటు శర్మ ఏర్పాటు చేసిన కంప్యూటర్ కేంద్రాల్లో ప్రస్తుతం వెయ్యి మందికి పైగా శిక్షణ పొందుతున్నారు. ఇదే సమయంలో 150 మందికి చోటు శర్మ ఉపాధిని కల్పించారు.

"ఛండీగఢ్​ సెక్టార్ 12లోని ఓ ప్రాంతాన్ని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అద్దెకు తీసుకున్నాను. అక్కడ శిక్షణనిస్తూ.. విద్యార్థులు పెరగడం వల్ల దాన్ని విస్తరించాను. 2009లో ఐటీ కంపెనీ ప్రారంభించాను. ఐదారుగురితోనే దాన్ని మొదలుపెట్టాను. అక్కడి నుంచి క్రమంగా అభివృద్ధి చెందుతూ వివిధ ప్రాంతాలకు కంపెనీని మారుస్తూ వచ్చాను. చివరికి మొహాలీలో కొంత స్థలాన్ని కొనుగోలు చేశాను. ఇప్పుడు నా దగ్గర 500 మంది ఉద్యోగులు ఉన్నారు. అక్కడ సాఫ్ట్​వేర్ డెవలప్​మెంట్ శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికీ నేను విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నా. బోధనలో నాకు సంతృప్తి దొరుకుతోంది."
-చోటు శర్మ, సీఎస్ ఇన్ఫోటెక్ సీఈఓ

చోటు శర్మ కార్యాలయం
విద్యార్థులకు బోధిస్తున్న చోటు శర్మ

ABOUT THE AUTHOR

...view details