Chhattisgarh naxals news: తన భర్తను అపహరించిన నక్సలైట్లను వెతుక్కుంటూ ఓ మహిళ అడవిలోకి వెళ్లింది. కిడ్నాప్ చేసిన తన భర్తను విడిచిపెట్టాలని వేడుకుంటూ తన రెండున్నరేళ్ల కూతురితో అడవి బాట పట్టింది. అయితే, మహిళ భర్తను నక్సల్స్ విడిచిపెట్టినా.. ఆమె ఇంకా అడవిలోనే చిక్కుకుపోవడం ఆందోళనకరంగా మారింది.
Kidnapped Engineer wife entered forest
ఇటీవల ఇంజినీర్ అశోక్ పవార్, కార్మికుడు ఆనంద్ యాదవ్‌ను నక్సల్స్ అపహరించుకుపోయారు. నాలుగు రోజుల తర్వాత వారిద్దరినీ విడిచిపెట్టారు. అయితే, వీరి విడుదలకు ముందే అశోక్ పవార్ భార్య సోనాలీ పవార్.. తన భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిపోయింది. ఆయన్ను విడుదల చేయాలని నక్సల్స్‌కు భావోద్వేగంతో విజ్ఞప్తి చేసిన సోనాలీ.. వారి నుంచి స్పందన లేకపోయేసరికి అడవిలోకి వెళ్లి నేరుగా కలవాలని భావించింది.
Engineer Ashok Pawar wife Naxals
'రెండున్నరేళ్ల కూతురి ముఖాన్ని చూసైనా తన భర్తను విడుదల చేయాలని నక్సల్స్‌ను వేడుకుంటూ సోనాలీ వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత భర్తను వెతుక్కుంటూ అబుజ్మద్ అడవిలోకి వెళ్లారు. స్థానిక జర్నలిస్టుల సాయంతో నక్సల్స్‌ను కలవాలని భావించారు. రెండున్నరేళ్ల కూతురిని వెంట తీసుకెళ్లారు. ఐదేళ్ల మరో కూతురు కుటుంబ సభ్యులతో ఉంది' అని ఓ జర్నలిస్ట్ వివరించారు.