ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లా బింజ్రా గ్రామం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో మర్వాహీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ కుమార్ ధ్రువ్ కుమారుడు ప్రవీణ్ కుమార్ ధ్రువ్(32) ఒకరు. మరో ఇద్దరు శంకర్ సింగ్ పోర్టే(28), కుషాల్ కుమార్ కన్వార్(32)గా పోలీసులు గుర్తించారు. వారంతా.. విద్యుత్ శాఖలో ఇంజినీర్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు.