Chhattisgarh helicopter crash: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. రాయ్‌పుర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయిందని రాయ్‌పుర్ విమానాశ్రయ డైరెక్టర్ రాకేశ్ సహాయ్ వెల్లడించారు. రన్‌వే చివర్లో ప్రమాదానికి గురైందని చెప్పారు.
కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి - హెలికాప్టర్ క్రాష్
22:16 May 12
కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి
హెలికాప్టర్లో పైలట్లు ఇద్దరే ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ అని అధికారులు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన హెలికాప్టర్ వద్దకు చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు. పైలట్లు కెప్టెన్ పాండా, కెప్టెన్ శ్రీవాస్తవ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ఇదీ చదవండి: