తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రిజర్వాయర్​లో రూ.96వేల ఫోన్​.. 21లక్షల లీటర్ల నీటిని వేస్ట్​ చేసిన అధికారి.. చివరకు.. - ఖరీదైన ఫోన్​ కోసం లక్షల లీటర్ల నీరు వృథా

ఖరీదైన ఫోన్​ కోసం గ్రామ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలకు ఉపయోగించే 21 లక్షల లీటర్ల నీటిని వృథా చేయించారు ఓ అధికారి. 21 లక్షల లీటర్ల నీటిని రిజర్వాయర్​ నుంచి బయటకు తోడించారు. మూడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే?

Chhattisgarh food inspector pumped 21 lakh liters of water from reservoir to get out expensive phone
రూ.96 వేల ఫోన్​ కోసం 21 లక్షల లీటర్ల నీటిని వృథా చేసిన ఫుడ్​ ఇన్‌స్పెక్టర్‌!

By

Published : May 26, 2023, 4:38 PM IST

రూ.96 వేల ఫోన్​ కోసం 21 లక్షల లీటర్ల నీటిని వృథా చేసిన ఫుడ్​ ఇన్‌స్పెక్టర్‌!

రూ.96 వేల ఫోన్​ కోసం ఏకంగా 21 లక్షల లీటర్ల నీటిని రిజర్వాయర్​ నుంచి బయటకు తోడించారు ఛత్తీస్​గఢ్​కు చెందిన ఫుడ్​ ఇన్‌స్పెక్టర్‌. అందుకు అధికారులు కూడా ఆయనకు సహకరించడం గమనార్హం. దాదాపు మొత్తం గ్రామ ప్రజల సాగు, తాగు నీరు అవసరాలను తీర్చే ఆ జలాశయంలో ఉన్న లక్షల లీటర్ల నీటిని తన స్వార్థం కోసం విడుదల చేయించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆ రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ ఘటనపై సీఎం భుపేశ్​ బఘేల్​ ప్రభుత్వాన్ని బీజేపీ సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

మూడు రోజులు కష్టపడి..
కాంకేర్​ జిల్లాలోని కోయిలిబెడ బ్లాక్‌కు చెందిన ఫుడ్ ఆఫీసర్ రాజేశ్​ విశ్వాస్​ విహారయాత్ర కోసం సోమవారం ఖేర్‌కట్టా పర్‌కోట్ రిజర్వాయర్‌కు వెళ్లారు. అక్కడ ఆయన సరదాగా సెల్ఫీ దిగుతున్న సమయంలో సుమారు రూ.96 వేల రూపాయల విలువైన శామ్​సంగ్​ ఫోన్​ రిజర్వాయర్‌లో పడిపోయింది. దీంతో తన ఫోన్​ను ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలనే ఆశతో జలవనరుల శాఖ అధికారులకు ఫోన్​ చేశారు.

వెంటనే స్పందించిన జిల్లా యంత్రాంగం.. రిజర్వాయర్​​ నుంచి ఎలాగైనా నీటిని తోడించి ఫోన్​ను అప్పజెప్తామని రాజేశ్​కు హామీ ఇచ్చింది. కొంతసేపటికే హుటాహుటిన 30హెచ్​పీ సామర్థ్యం కలిగిన పంపులతో జలవనరుల శాఖ సిబ్బంది ఆ జలాశయం వద్దకు చేరుకుంది. అందులో ఉన్న నీటిని బయటకు పంపించే పనిని ప్రారంభించారు. మూడు రోజులు గడిచే సరికి సుమారు 21 లక్షల లీటర్ల నీటిని బయటకు వృథాగా పంపించారు. ఎట్టకేలకు గురువారం ఫుడ్​ ఇన్‌స్పెక్టర్‌​ రాజేశ్​ విశ్వాస్​కు చెందిన ఖరీదైన ఫోన్​ను బయటకు తీయగలిగారు. అయినా ఆ ఫోన్​ ఆన్​ కాలేదు.

ఫుడ్​ ఇన్‌స్పెక్టర్​ రాజేశ్ విశ్వాస్

5 అడుగులు తోడమంటే.. 10 అడుగులు తీశారు!
ఫుడ్​ ఇన్‌స్పెక్టర్‌​ రాజేశ్​ ఫోన్​ పడ్డ రిజర్వాయర్​లో 15 అడుగుల మేర నీరు నిండి ఉంది. అయితే జలాశయం నుంచి నీటిని తోడి ఫోన్​ బయటకు తీయమని ఆదేశించిన మాట వాస్తవేమనని అధికారులు చెప్పారు. అయితే కేవలం 5 అడుగుల నీరును మాత్రమే తీయమన్నామని.. కానీ సిబ్బంది మాత్రం 10 అడుగుల వరకు నీటిని తొలగించిందని జలవనరుల శాఖ ఎస్‌డీఓ రామ్​ లాల్ ధివర్ తెలిపారు.

ప్రభుత్వం చుట్టూ వివాదం!
ఈ వ్యవహారం కాస్త అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వానికి అంటుకుంది. కేవలం రూ.96 వేల ఫోన్​ కోసం నీటిని వృథా చేయిస్తారా అంటూ బీజేపీ సహా ప్రతిపక్షాలు.. బఘేల్​ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. సీఎం ఆధ్వర్యంలోని అధికారుల బృందం రాష్ట్రంలో నియంతృత్వ వైఖరిని సాగిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఆ రాష్ట్ర మంత్రి అమర్జీత్ భగత్​ విచారణ పూర్తయ్యాక బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details