తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లోకి వెళ్లి ఏనుగు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం - ఏనుగు దాడి ఇద్దరు మృతి

Elephant Attack House: నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి వెళ్లి ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఆ ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి సహా అతడి కుమార్తెను గజరాజు తొక్కిచంపింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు.. ఏనుగును తరిమికొట్టారు. ఈ విషాద ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

Elephant Attack House:
Elephant Attack House:

By

Published : May 22, 2022, 5:05 PM IST

Elephant Attack House: ఛత్తీస్​గఢ్​ కోరియా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా ఏనుగులు తరచూ బీభత్సం సృష్టిస్తున్నాయి. జనావాసాల్లోకి వచ్చి ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగిస్తున్నాయి. తాజాగా శనివారం రాత్రి మనేంద్రగఢ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఓ ఏనుగు.. నిర్మాణంలో ఉన్న ఇంటిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

ఇదీ జరిగింది..శనివారం రాత్రి మనేంద్రగఢ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బెల్​గావ్​ గ్రామంలో ఓ ఏనుగు ప్రవేశించింది. గ్రామానికి చెందిన గులాబ్​ సింగ్​ గోండ్ ​(25) ఇంటిపై దాడి చేసింది. నిర్మాణంలో ఉన్న అతడి ఇంట్లోకి వెళ్లి బీభత్సం సృష్టించింది. గోండ్​తోపాటు అతడి ఆరేళ్ల కుమార్తె షాను (6) ఏనుగు తొక్కి చంపింది. అయితే ఈ దాడిలో గోండ్​ భార్య సునీత తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది.

"నిర్మాణంలో గోండ్​ ఇంటిని ధ్వంసం చేసింది గజరాజు. ఈ దాడిలో గోండ్​తో పాటు అతడి కుమార్తె మరణించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగును తరిమికొట్టారు. అయితే ముందుగానే ఏనుగు సంచారంపై అధికారులు మైక్​ అనౌన్స్​మెంట్​ ద్వారా గ్రామస్థులను అప్రమత్తం చేశారు. బాధితుల కుటుంబం గ్రామానికి దూరంగా ఉండడం వల్ల వారికి సమాచారం అందలేదు. మృతుల కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ. 25,000 అందించాం. మిగిలిన పరిహారం తర్వాత అందజేస్తాం" అని అటవీ అధికారి లోక్​నాథ్​ పటేల్​ తెలిపారు.

ఇవీ చదవండి:కుక్కల నుంచి తప్పించుకోబోయి బోరుబావిలో బాలుడు- మృత్యువుతో పోరాటం

పోలీస్​ స్టేషన్​కు నిప్పు.. బుల్డోజర్లతో నిందితుల ఇళ్లు కూల్చివేత

ABOUT THE AUTHOR

...view details