బోల్తాపడ్డ ఆదీవాసీల ట్రాక్టర్ ఛత్తీస్గఢ్ దంతెవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆదివాసుల ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 13 మందికి పైగా గాయపడ్డారు.
చెరువులో బోల్తా పడిన ట్రాక్టర్ కటేక్యాలమ్ తాలుకా నుంచి 30 మంది ఆదివాసీలు.. హీరానగర్లో జరగుతున్న ఆదివాసీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తేలమ్, టేటా మధ్య ఉన్న ఓ చెరువులో ట్రాక్టర్ అదుపు తప్పి పడిపోయింది.
ట్రాక్టర్ కిందపడ్డ వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు డీఆర్జీ జవాన్లు..
ఈ ప్రమాద సమాచారం అందుకున్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ట్రాక్టర్ కింద చిక్కుకున్న వారిని రక్షించారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాలను స్థానిక అధికారులు... పోస్టు మార్టం కోసం తరలించారు. వారిని కోసా మాదవీ, దేశాయ్ కావాసీ, దినేశ్ మార్కమ్, ఫూకే కావాసీగా అధికారులు గుర్తించారు.
ఇదీ చూడండి:ఉగ్ర దాడిలో భాజపా సర్పంచ్ దంపతులు మృతి