Cop Suicide at BJP office: ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో భాజపా కార్యాలయంలో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 48 ఏళ్ల రాజ్‌కుమార్ నేతమ్ అనే పోలీస్.. బుధవారం తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతడిని మాన 4వ బెటాలియన్‌కు చెందినవాడిగా గుర్తించారు అధికారులు.
భాజపా కార్యాలయంలోనే హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య - పోలీస్ సూసైడ్
Cop Suicide at BJP office: భాజపా కార్యలయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు ఓ పోలీస్ హెడ్‌కానిస్టేబుల్. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జరిగింది.
![భాజపా కార్యాలయంలోనే హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య cop suicide in chhattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14488966-thumbnail-3x2-yv.jpg)
Cop Suicide at BJP office
భాజపా నగర యూనిట్ వద్ద విధుల్లో ఉన్న రాజ్‌కుమార్ స్వస్థలం కాంకేర్ జిల్లా. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన తరలివచ్చారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు.
ఇదీ చూడండి:భర్తను కిడ్నాప్ చేసిన నక్సల్స్- కూతురితో అడవిలోకి భార్య