ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ (Nand Kumar Baghel) అరెస్టయ్యారు. ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అదుపులోకి (Nand Kumar Baghel arrested) తీసుకున్నారు. రాయ్‌పుర్‌లోని న్యాయస్థానంలో నందకుమార్‌ను హాజరుపర్చగా... ఆయనకు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
బెయిల్ కోసం దరఖాస్తు చేసే అవకాశమున్నా... నంద కుమార్ వద్దన్నారని ఆయన తరఫు న్యాయవాది గజేంద్ర శంకర్ వెల్లడించారు. ఈనెల 21న ఆయన్ను పోలీసులు కోర్టులో హాజరుపరుచుతారని చెప్పారు.
సీఎం స్పందన ఇలా...