ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దిల్లీలోని రాహుల్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. సీఎం పదవి నుంచి భూపేశ్ తప్పుకోనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
రాజకీయాలు, ప్రభుత్వ పాలనపై చర్చించినట్టు భేటీ అనంతరం భూపేశ్ మీడియాకు వెల్లడించారు. అయితే సీఎం పదవి మార్పుపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
"రాహుల్‌కి మొత్తం చెప్పాను. రాజకీయ, ప్రభుత్వ పాలనపై చర్చలు జరిగాయి. ఆయన్ని ఛత్తీస్‌గఢ్‌కు ఆహ్వానించాను. అందుకు ఆయన అంగీకరించారు. వచ్చే వారం ఆయన ఛత్తీస్‌గఢ్‌కు వస్తారు. బస్తర్‌ను సందర్శించి, వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఇంతకు మించి నేను ఏమీ చెప్పదలచుకోలేదు(సీఎం పదవిపై). అన్నీ ముందే చెప్పాను. మా నాయకుడికి అన్నీ చెప్పాను. పీఎల్ పునియా(ఛత్తీస్‌గఢ్ ఏఐసీసీ ఇన్ఛార్జ్)కి అన్ని విషయాలు ముందే చెప్పేశాను."
--- భూపేష్ భగేల్, ఛత్తీస్‌గఢ్ సీఎం.