తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొరడాతో కొట్టించుకున్న సీఎం- రాష్ట్ర సంక్షేమం కోసం... - Bhupesh Baghel news

ఛత్తీస్​గఢ్​ దుర్గ్ జిల్లాలో జరిగే గోవర్థన పూజకు ఆ రాష్ట్ర సీఎం భూపేశ్​ బఘేల్ (Bhupesh Baghel news) హాజరయ్యారు. అక్కడ కొరడాతో దెబ్బలు తినే సంప్రదాయాన్ని పాటించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.

Bhupesh Baghel getting whipped as part of a ritual
దెబ్బలు కొట్టించుకున్న ఛత్తీస్​గఢ్ సీఎం!

By

Published : Nov 5, 2021, 1:57 PM IST

Updated : Nov 5, 2021, 6:11 PM IST

దెబ్బలు కొట్టించుకున్న ఛత్తీస్​గఢ్ సీఎం!

ఛత్తీస్​గఢ్ దుర్గ్​ జిల్లా జంజిగిరి గ్రామంలో జరిగిన గోవర్థన పూజకు (Govardhan puja 2021) ఆ రాష్ట్ర సీఎం భూపేశ్​ బఘేల్ (Bhupesh Baghel news)​ హాజరయ్యారు. అక్కడ 'సొంటా'(కొరడాతో చేతులపై కొట్టించుకోవడం) సంప్రదాయంలో పాలుపంచుకున్నారు. చేతులపై కొరడాతో కొట్టించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.

"గోవులను ఈ పూజలో కొలుస్తాము. గోసంతానంపై మనం చూపే గౌరవాన్ని ఈ వేడుక సూచిస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టుకోవడం మన విధి. భవిష్యత్ తరాలకు వాటిని అందించాలి."

-భూపేశ్​ బఘేల్, ఛత్తీస్​గఢ్ సీఎం

కొరడా సంప్రదాయం:

ప్రతి ఏడాది దీపావళి మరుసటి రోజు దుర్గ్​ జిల్లాలోని జంజిగిరి గ్రామంలో ఈ పూజ జరుగుతుంది. ఇందులో భాగంగా చేతులపై కొరడాతో బలంగా కొట్టించుకుంటారు. ఈ విధానాన్ని ఏటా ఒకే వ్యక్తి చేతుల మీదుగా జరుగుతుంది. ఇలా కొట్టించుకోవడం వల్ల కష్టాలను ఎదుర్కొనే సహనం అలవడుతుందని అక్కడి ప్రజల నమ్మకం. అంతేకాకుండా సంపదలు, సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం.

గ్రామపెద్ద భరోసా ఠాకూర్ సొంటా సంప్రదాయాన్ని ఇంతకుముందు కొనసాగించేవారు. ఆయన మరణం తర్వాత అతని కుమారుడు బీరేంద్ర ఠాకూర్ కుటుంబ వారసత్వ పద్ధతిని కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:కేదార్​నాథ్​లో మోదీ ప్రత్యేక పూజలు- ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణ

Last Updated : Nov 5, 2021, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details