ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు (Chhattisgarh Bijapur news today) కిడ్నాప్ చేసిన... ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాకు విముక్తి లభించింది. బీజాపూర్ జిల్లా (Chhattisgarh Bijapur naxal) మాన్ కేళి, ఘడ్ గోర్ణ రోడ్డు నిర్మాణ పనులను గత గురువారం పరిశీలించడానికి వెళ్లినప్పుడు.. సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్‌తో పాటు అటెండర్‌ను... మావోయిస్టులు అపహరించుకెళ్లారు.
శుక్రవారం అటెండర్ లక్ష్మణ్‌ను విడిచిపెట్టిన మావోయిస్టులు (Chhattisgarh Bijapur news today) అజయ్ రోషన్‌ను మాత్రం తమ దగ్గరే ఉంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అజయ్ భార్య అర్పిత కన్నీరుమున్నీరైంది. భర్త తప్ప తనకు మరో దిక్కులేదని ఆయన ప్రాణాలే ప్రమాదంలో పడ్డాయని తెలిసి బోరుమంది. అయితే వెంటనే తేరుకున్న ఆమె... తన భర్తను ఎలాగైనా విడిపించుకోవాలని సంకల్పించింది. స్థానిక జర్నలిస్టులు, సామాజికవేత్తల సాయం కోరింది. అంతటితో ఆగకుండా నాటి సతీసావిత్రిని గుర్తుచేసుకుందో ఏమో తెలియదుగానీ.. తన భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లింది. రెండేళ్ల బిడ్డను ఎత్తుకొని.. కిలోమీటర్ల కొద్ది కాలినడకనే ప్రయాణం సాగించింది.