ఛత్తీస్గఢ్లో నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. కొండగావ్ జిల్లా బట్రాలి-చెర్బెడా ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎమ్‌జీఎస్‌వై)పథకం కింద చేపట్టిన రహదారి నిర్మాణ పనుల్లో వినియోగించే వాహనాలకు నిప్పుపెట్టారు.
గురువారం అర్ధరాత్రి సమయంలో మొత్తం 12 వాహనాలను తగలబెట్టారని బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందర రాజ్ తెలిపారు.