ఉత్తర్ప్రదేశ్, బిహార్, అసోం తదితర రాష్ట్రాల్లో 'ఛఠ్ పూజ' ఉత్సవాలను ప్రజలు సంబరంగా జరుపుకున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్తరాదిన ఘనంగా 'ఛఠ్ పూజ'
'ఛఠ్ పూజ' మూడో రోజును ఉత్తరాదిన పలు రాష్ట్రాలు ఘనంగా నిర్వహించాయి. ప్రజలు భక్తిశ్రద్ధలతో సూర్యభగవానుడిని ప్రార్థించారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా మహారాష్ట్రలో ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
ఉత్తరాదిన ఘనంగా 'ఛఠ్ పూజ' ఉత్సవాలు
ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని అస్సీ ఘాట్లో ప్రజలు పూజలు చేశారు. బిహార్ ముజఫర్పుర్, పట్నా కాలేజీ ఘాట్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజించారు. అసోంలోని బ్రహ్మపుత్ర నదీతీరంలో ప్రజలు ఉత్సాహంగా పూజల్లో పాల్గొన్నారు.
అయితే కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలో ఈ సారి ఛఠ్ పూజను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించుకోవద్దని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంట్లోనే పూజను జరుపుకోవాలని సూచించింది.