woman lived with dead body: తమిళనాడు చెన్నైలోని పురాసవల్కం ప్రాంతంలో ఓ మహిళ తన భర్త మరణించినా... అంత్యక్రియలు నిర్వహించకుండా రెండు రోజులు శవాన్ని ఇంట్లోనే ఉంచేసింది. మహిళ తన ఇంటికి తాళం వేసుకొందని పోలీసులు తెలిపారు.
అశోక్ బాబు(53) అనే వ్యక్తి తన భార్య పద్మినీ(48)తో కలిసి వైకోకరన్ స్ట్రీట్లో నివసిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు విదేశాల్లో పనిచేస్తున్నాడు. కుమార్తెకు వివాహమై.. బెంగళూరులో నివసిస్తోంది. పద్మినీ మానసిక సమస్యలతో బాధపడుతోంది.
భర్త శవంతో రెండ్రోజులు ఇంట్లోనే... పోలీసులు తలుపులు బద్దలు కొట్టగానే... - chennai crime news
woman lived with dead body: భర్త మృతదేహంతో రెండు రోజులు ఇంట్లోనే గడిపింది ఓ మహిళ. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

కాగా, రెండు రోజుల నుంచి కూతురు ఆర్తి తన తండ్రికి ఫోన్ చేస్తున్నప్పటికీ.. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో ఆర్తి తమిళనాడులోని స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వెళ్లారు. అశోక్ బాబు చనిపోయి ఉండటాన్ని గమనించారు. శరీరంపై దుస్తులు లేకుండా నేలపై పడి ఉన్నాడని పోలీసులు తెలిపారు. శవం పక్కనే పద్మినీ కూర్చొని ఉందని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. పద్మినీని మానసిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: