తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 5:13 PM IST

Updated : Oct 24, 2023, 6:04 PM IST

ETV Bharat / bharat

Chennai Train Accident Today : రైల్వే ట్రాక్​పై ఆటలు.. ట్రైన్ ఢీకొని ముగ్గురు దివ్యాంగ చిన్నారులు మృతి

Chennai Train Accident Today : రైల్వే పట్టాలపై ఆడుకుంటున్న ముగ్గురు దివ్యాంగ చిన్నారులు..​ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. తమిళనాడులోని చెన్నై శివార్లలో జరిగిందీ విషాద ఘటన.

Chennai Train Accident Today
Chennai Train Accident Today

Chennai Train Accident Today : తమిళనాడులోని చెన్నై శివార్లలో విద్యుత్​ రైలు ఢీకొని ఒకే కుటుంబానికి ముగ్గురు దివ్యాంగ చిన్నారులు ప్రాణాలు కోల్పాయారు. రైలు శబ్దం వారికి వినిపించకపోవడమే తీవ్ర విషాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను సురేశ్​, రవి, మంజునాథ్​గా పోలీసులు గుర్తించారు.

తల్లిదండ్రుల వద్దకు వచ్చి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని తోప్పుర్​కు చెందిన శ్రీ సంజం పన్నన్​, అతడి తమ్ముడు శ్రీ అనుమంతప్ప కుటుంబాలు కొన్నేళ్లుగా తమిళనాడులో నివసిస్తున్నాయి. చెన్నై శివార్లలోని చెల్లియమన్న్​ కోవిల్​ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాయి. అయితే వీరి పిల్లలు సురేశ్​(15), రవి(10), మంజునాథ్​(11).. కర్ణాటకలోనే తమ అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నారు. సురేశ్​, రవి బధిరులు కాగా.. మంజునాథ్​ పుట్టుకతో మూగవాడు. దసరా సెలవులు కావడం వల్ల తమిళనాడులోని తమ తల్లిదండ్రుల వద్దకు వీరు వచ్చారు.

పట్టాలపై ఆడుకునేందుకు వెళ్లి..
అయితే మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు బాలురు.. ఉరప్పక్కం సమీపంలో ఉన్న రైలు పట్టాలపై ఆడుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో చెన్నై బీచ్​ స్టేషన్​ నుంచి చెంగల్​పట్టు వెళ్తున్న ఓ రైలు.. వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే పోలీసులకు సమచారం అందించారు.

మృతి చెందిన బాలురు వీరే

శబ్దం వినిపించకపోవడం వల్లే!
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురు చిన్నారుల మృతదేహాలను శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. అయితే రైలు వచ్చేటప్పుడు శబ్దం.. చిన్నారులకు వినిపించకపోవడం వల్లే ఈ విషాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.

పట్టాలు తప్పిన మూడు బోగీలు..
Train Derail Chennai :చెన్నైలో మంగళవారం ఉదయం.. మూడు ఖాళీ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఆవడి వద్ద రైలు ట్రాక్‌ మారుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా సమయంలో బోగీల్లో ప్రయాణికుల లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రధాన విద్యుత్‌ లైను దెబ్బతినడం వల్ల కొన్ని రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు జరిగాయి. వందేభారత్‌, శతాబ్ది, చెన్నై-కోయంబత్తూర్‌ కోవై ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు-బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌, డబుల్‌ డెక్కర్‌ రైళ్ల ప్రయాణ సమయాలను మార్చినట్టు వెల్లడించారు.

పులి పంజాకు ఇద్దరు బలి.. రైలు ఢీకొని మరో నలుగురు కార్మికులు మృతి

ప్రమాదవశాత్తు రైలు ఢీకొని.. విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మృతి

Last Updated : Oct 24, 2023, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details