రూ. 5కోట్లకుపైగా విలువచేసే మాదకద్రవ్యాల్ని ఖతార్‌లోని దోహాకు సరఫరా చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల్ని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. చెన్నైలోని పాత విమానాశ్రయం నుంచి దోహాకు వెళ్ళనున్న కార్గో విమానంలో తనిఖీ చేయగా విషయం బయటపడింది.
రూ.5కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్ పట్టివేత - డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్టు
చెన్నై నుంచి దోహాకు తరలిస్తున్న రూ.5కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు.

రూ.5కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
బరువు తూచే యంత్రంలో డ్రగ్స్ సరఫరా
అందులోని ఓ పార్సిల్లో బరువు తూచే యంత్రంలో 4.44 కేజీల గంజాయి, 700 గ్రాముల మెతమ్‌ఫెటమైన్ అనే డ్రగ్స్‌తో పాటు 1.2కిలోల ఇతర మాదక ద్రవ్యాల్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాటి విలువ రూ.5.1కోట్లు ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి:రూ.2 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టివేత