Chennai First SC woman Mayor: చెన్నై కార్పొరేషన్‌కు తొలిసారిగా షెడ్యూల్ కులాలకు చెందిన ఓ మహిళ మేయర్‌గా ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికల్లో ఈ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయగా.. డీఎంకే ఘన విజయం సాధించింది. చెన్నైలో 153 వార్డులను స్టాలిన్ పార్టీ కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే తమ పార్టీ అభ్యర్థి ప్రియా రాజన్‌ను మేయర్ పదవికి ఎంపిక చేసింది డీఎంకే. తద్వారా.. 340 ఏళ్ల చెన్నై పురపాలిక చరిత్రలో మేయర్ పదవికి ఎన్నికైన తొలి దళిత అభ్యర్థిగా ప్రియా రాజన్ రికార్డు సృష్టించారు.