తెలంగాణ

telangana

ETV Bharat / bharat

75శాతం ఉద్యోగాలు స్థానికులకే.. డీఎంకే మేనిఫెస్టో - tamilnadu

తమిళనాడులో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేనిఫెస్టో విడుదల చేసింది డీఎంకే. ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్​ సహా ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థులు, హిందువులపై వరాల జల్లు కురిపించింది.

Chennai: DMK President MK Stalin releases party manifesto for Tamil Nadu assembly elections
డీఎంకే మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్

By

Published : Mar 13, 2021, 12:53 PM IST

Updated : Mar 13, 2021, 2:41 PM IST

స్థానికులు, హిందూ ఓట్లే లక్ష్యంగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే). తాము అధికారంలోకి వస్తే విద్యార్థులకు కంప్యూటర్ ట్యాబ్లెట్లు సహా ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కల్పిస్తామని ప్రమాణం చేసింది. ఏప్రిల్​ 6న జరిగనున్న ఎన్నికల కోసం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో డీఎంకే అధినేత ఎమ్​కే స్టాలిన్ శనివారం మేనిఫెస్టో ఆవిష్కరించారు.

స్థానికులు, విద్యార్థులకు పెద్దపీట

తొలితరం పట్టభధ్రులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్

పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కల్పనకు చట్టం

పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ ట్యాబ్లెట్లు, డేటా కార్డ్

నీట్ పరీక్ష రద్దు

హిందువులకు వరాలు..

పెద్ద హిందూ ఆలయాల తీర్థయాత్రలకు వెళ్లే లక్ష మందికి రూ.25 వేల ఆర్థిక సాయం

హిందూ దేవాలయాల పునరుద్ధరణకు రూ.వెయ్యి కోట్ల కేటాయింపు

చర్చిలు, మసీదుల నవీకరణకు మరో రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని హామీ.

ధరలు తగ్గిస్తాం..

పెట్రోల్​పై రూ.5, డీజిల్​పై రూ.4లు తగ్గిస్తాం

ఎల్​పీజీ సిలిండర్​పై రూ.100 సబ్సిడీ

డీఎంకే అధినేత స్టాలిన్

2016లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి కారణాలు వెలికితీసేందుకు ఏర్పాటైన అరుముళసామి కమిటీ నివేదిక త్వరితగతిన సమర్పించేలా చర్యలు తీసుకుంటామని స్టాలిన్ పేర్కొన్నారు.

మెరుగైన వసతులు..

చిన్న రైతులకు సబ్సిడీలు, మెరుగైన నీటి పారుదల వ్యవస్థ, సురక్షిత మంచినీటి సరఫరా, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్ల పెంపు, వృద్ధుల పింఛను మొత్తాలను పెంచుతామని డీఎంకే వాగ్ధానం చేసింది. ఆకలి బాధలను అరికట్టడానికి 'కళైనర్ ఉనవగమ్' శాలలతో ఆహారం అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇదీ చూడండి:'అన్నాడీఎంకే.. మోదీకి బానిసగా మారింది'

Last Updated : Mar 13, 2021, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details