తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బైక్​లపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్​లో ఆరుగురు మృతి.. బొలెరో లోయలో పడి మరో ఏడుగురు.. - himachal pradesh accident today

Chengalpattu Road Accident Today : తమిళనాడులో ఓ లారీ అదుపుతప్పి మూడు బైక్​లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్​లపై ఉన్న ఆరుగురు మరణించారు. శుక్రవారం ఉదయం జరిగిందీ ప్రమాదం. మరోవైపు.. హిమాచల్​ప్రదేశ్​లో ఓ బొలెరో వాహనం అదుపుతప్పి 100 అడుగుల లోతున్న లోయలో పడిన దుర్ఘటనలో ఏడుగురు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు.

Chengalpattu road accident today
Chengalpattu road accident today

By

Published : Aug 11, 2023, 12:12 PM IST

Updated : Aug 11, 2023, 1:45 PM IST

Chengalpattu Road Accident Today : అదుపుతప్పి ఓ లారీ.. రోడ్డు దాటుతున్న మూడు బైక్​లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్​లపై ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తమిళనాడు.. చెంగల్పట్టు జిల్లాలోని పొతేరి సమీపంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న గుడవంచెరి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్​మార్టం పరీక్షల కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నుజ్జునుజ్జైన మృతదేహాలు..
Lorry Rammed Into Bikes : ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యాయి. ఘటనాస్థలికి స్థానికులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వారందరినీ పోలీసులు చెదరగొట్టారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బైక్​లను ఢీకొట్టిన అనంతరం లారీ.. బారికేడ్​ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులు వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. గుర్తుపట్టలేనంత మృతదేహాలు నుజ్జునుజ్జయాయని పోలీసులు అన్నారు.

లోయలో పడిన బొలేరో.. ఏడుగురు మృతి
Himachal Pradesh Accident Today : ఓ బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు పోలీసులు, ఓ డ్రైవర్ ఉన్నారు. హిమాచల్​ప్రదేశ్ చంబా జిల్లాలో శుక్రవారం జరిగిందీ దుర్ఘటన.

అసలేం జరిగిందంటే..
Bolero Falls into Gorge in Himachal Pradesh : చంబా జిల్లాలోని తీసా నుంచి బైరాగఢ్‌కు రోడ్డు మార్గంలో వెళ్తున్న ఓ బొలెరో 100 మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చంబా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బొలెరోలో 11 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 9 మంది పోలీసులు, డ్రైవర్‌, స్థానికుడు ఉన్నట్లు సమాచారం. లోయలో పడ్డ వాహనాన్ని తీసేందుకు పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే చురహ్​ ఎమ్మెల్యే హంసరాజ్​ పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

లోయలో పడిన బొలెరో వాహనం

మథుర వెళ్తుండగా విషాదం.. ట్రాక్టర్​- ట్రక్కు ఢీ.. ఆరుగురు భక్తులు మృతి

లగేజ్​ వ్యాన్​పై ట్యాంకర్ బోల్తా.. 8 మంది మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం

Last Updated : Aug 11, 2023, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details