తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సన్నీలియోనీ భర్తను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్​ - సన్నీలియోనీ భర్త కారు కేసు

సన్నీలియోనీ భర్త డేనియల్ వెబర్​ను మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. డేనియల్​కు విక్రయించిన కారు నకిలీ నంబరుతో నిందితుడు తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు.

cheating-on-sunny-leones-husband-one-arrested
సన్నీలియోనీ భర్తను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్​

By

Published : Feb 25, 2021, 3:12 PM IST

బాలీవుడ్​ నటి సన్నీలియోనీ భర్త డేనియల్​ వెబర్​ను మోసగించిన వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పీయుష్​ సేన్​పై కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. పీయుష్​​.. డేనియల్​ వెబర్​ స్నేహితుడు కావడం గమనార్హం.

అసలు ఏం జరిగింది?

లగ్జరీ కార్లంటే ఇష్టపడే డేనియల్​.. కొద్ది రోజుల క్రితం పీయుష్​ సేన్​ నుంచి మెర్సిడీస్​ బెంజ్ ​కారు కొనుగోలు చేశాడు. అయితే తను ఎలాంటి ట్రాఫిక్​ ఉల్లంఘనలకు పాల్పడక పోయినా తరచూ ఈ-చలాన్​లు వచ్చేవి. దీనిపై ట్రాఫిక్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.

డేనియల్​కు విక్రయించిన వాహనంలాంటి దానిలోనే.. అదే నంబరు ఉన్న నకిలీ ప్లేటుతో పీయుష్​ తిరిగేవాడు. తరచూ ట్రాఫిక్​ నిబంధనలను ఉల్లంఘించేవాడు. ఈ క్రమంలో అతడు పోలీసులకు మంగళవారం పట్టుబడ్డాడు.

ఇదీ చదవండి :తమిళనాడులో పబ్లిక్ పరీక్షలు రద్దు

ABOUT THE AUTHOR

...view details