దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై సినిమా పేరిట ఓ హోటల్ యజమానికి టోకరా కొట్టారు కొందరు వ్యక్తులు. దేశ రాజధాని దిల్లీ సమీపంలోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. రూ.8లక్షలు మోసపోయానంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదైంది.
ఇదీ జరిగింది:నిందితులు విజయ్ శేఖర్, నితిన్ పంత్, సచిన్ తివారీ, వరుణ్ ఖండేల్వాల్.. నోయిడా థానా సెక్టార్-39లోని ఓ హోటల్లో నాలుగు గదులు బుక్ చేసుకున్నారు. హోటల్ నిర్వాహకులతో.. తమను తాము డైరెక్టర్లుగా పరిచయం చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై సినిమా తీస్తామంటూ చెప్పుకున్నారు. సుశాంత్ పాత్రను తాను పోషించనున్నట్లు సచిన్ తివారీ.. హోటల్ యజమానికి చెప్పాడు.