ఉపాధి కోసం దిల్లీ వెళ్లి.. అక్కడి ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఝార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి.. 1200 కిలోమీటర్లు దూరం నడిచి స్వస్థలం చేరుకున్నాడు.
ఇదీ జరిగింది
ధన్‌బాద్ జిల్లాలోని యమనితాకు చెందిన బర్జోమ్ భమ్దా పహాడియాకు ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు ఏజెంట్లు దిల్లీ తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక అతడ్ని మోసం చేశారు. ఉపాధి కల్పించలేదు సరికాదా.. పహాడియా వద్ద ఉన్న సొమ్మును కూడా లాక్కున్నారు. ఇంటి వెళ్లడానికి ఛార్జీకి డబ్బులు లేని పరిస్థితుల్లో.. కాలినడకనే స్వస్థలం చేరాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లేదారి తెలియక రైలు పట్టాల వెంబడి నడవడం ప్రారంభించాడు. దారిలో నీళ్లు ఎక్కువగా తాగుతూ.. దొరికిన చోట ఆహారం తింటూ పయనం కొనసాగించాడు. రాత్రి, పగలు అనకుండా నడిచిన పహాడియా.. మార్గం మధ్యలో తన బ్యాగును పోగొట్టుకున్నాడు.