చార్ధామ్ యాత్ర (chardham yatra 2021) శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకు వచ్చే యాత్రికులు.. వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్‌ను సమర్పించాలని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోని వారు ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు టీకాను తప్పనిసరి చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి వచ్చే వారు.. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకుని 15 రోజులు పూర్తయితేనే యాత్రకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాలకు చెందిన యాత్రికులు కొవిడ్ నెగటివ్ రిపోర్టు కూడా తప్పనిసరిగా సమర్పించాలని తెలిపింది.