పంజాబ్ సీఎంగా చరణ్జీత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు(punjab cm latest news). గవర్నర్ పురోహిత్.. చన్నీ చేత ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. చంకౌర్ సాహెబ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న చన్నీ.. పంజాబ్ తొలి దళిత సీఎంగా చరిత్రకెక్కారు.
కాంగ్రెస్ నేత ఓపీ సోనీ, సుఖ్జీందర్ రంధావాలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. సామాజిక సమీకరణల కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్టు వార్తలు బయటకొచ్చిన నేపథ్యంలో వీరి ప్రమాణస్వీకారానికి ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రమాణస్వీకార మహోత్సవానికి కొద్ది గంటల ముందు.. రూప్నగర్లోని ఓ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు చన్నీ. మద్దతుదారులు, పార్టీ నేతలతో కలిసి గురుద్వారాను సందర్శించారు.
మోదీ శుభాకాంక్షలు..