Chandrayaan 3 Pragyan Rover Update : చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ఆక్సిజన్‌తోపాటు సల్ఫర్ ఉనికిని స్పష్టంగా గుర్తించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా జాబిల్లిపై విజయవంతంగా పయనిస్తోన్న ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి ఉపరితలంపై పరిశోధనలో కీలక అంశాలను గుర్తించిందని వారు వెల్లడించారు. ఇందులోని 'లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్'(లిబ్స్) పరికరం.. అల్యూమినియం (Al), కాల్షియం (Ca), ఫెర్రమ్ (ఇనుము, Fe), క్రోమియం (Cr), టైటానియం (Ti), సిలికాన్ (Si), మాంగనీస్ (Mn), ఆక్సిజన్ (O) మూలకాలను సైతం గుర్తించినట్లు పేర్కొన్నారు.
Oxygen and Sulphur on Moon Chandrayaan-3 Confirm : కాగా హైడ్రోజన్ కోసం కూడా 'లిబ్స్' శోధన కొనసాగిస్తోందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు.. అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకుగానూ 'లిబ్స్' అనే పరికరాన్ని పంపించారు శాస్త్రవేత్తలు. ఈ పరికరాన్ని బెంగళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ప్రయోగశాలలో అభివృద్ధి చేసినట్లు ఇస్రో పేర్కొంది.
Chandrayaan 3 Moon South Pole Temperature : జాబిల్లి దక్షిణ ధ్రువానికి సమీపంలో శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్న విక్రమ్ ల్యాండర్ నుంచి ఆదివారం తొలి శాస్త్రీయ డేటాను అందుకుంది ఇస్రో. చంద్రుని ఉపరితలం ఉష్ణ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి, దక్షిణ ధ్రువం చుట్టూ ఉన్న ఉపరితలం ఉష్ణోగ్రత ప్రొఫైల్‌ను 'చాస్టే' పేలోడ్ కొలిచినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ చాస్టే పేలోడ్‌లో ఉష్ణోగ్రత ప్రోబ్ ఉంటుందని పేర్కొంది. ఇది ఉపరితలం కింద 10 సెంటీమీటర్ల లోతు వరకు చేరుకోగలదని.. చంద్రుని ఉపరితలంలో మైనస్ 10 డిగ్రీల నుంచి 60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల్లో తేడాలను చాస్టే గుర్తించిందని ఇస్రో ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.