అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశాం - మరో 3 నెలల్లో ఇక్కడా చూస్తాం: చంద్రబాబు Chandrababu Visited Farmers Lost their Crops Due to Cyclone:మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాలైన ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల్లో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. తెనాలి నుంచి నందివెలుగు అక్కడి నుంచి అమృతలూరు, నగరం, కర్లపాలెం మండలాకు వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి బాపట్లలోనే చంద్రబాబు బస చేస్తారు.
నిండా ముంచిన మిగ్‌జాం తుపాను - ఆందోళనలో రైతులు
Chandrababu Visit Mangalagiri Constituency Farmers:తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన మంగళగిరి నియోజకవర్గం దేవేంద్రపాడు రైతులను చంద్రబాబు పరామర్శించారు. ప్రజల కష్టాలు ఇక మూడు నెలలు మాత్రమేనని అన్నారు. దెబ్బతిన్న పంటను పరిశీలించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఇవాళ తాను పర్యటనకు వస్తున్నానని తెలిసి ముఖ్యమంత్రి జగన్ హడావుడిగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరాడని చంద్రబాబు విమర్శించారు. కష్టకాలంలో పొలాల్లో ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో తాము నష్టపరిహారం పెంచుకుంటూపోతే జగన్ తగ్గించుకుంటూ వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో వైసీపీ సర్కారు ఉందని చంద్రబాబు విమర్శించారు. మరో మూడు నెలల్లో ప్రజల కష్టాలు తీరతాయన్న చంద్రబాబు ధైర్యంగా ఉండాలని రైతులను ఓదార్చారు. ఇప్పుడు కనుక ప్రభుత్వం రైతుల్ని ఆదుకోకుంటే నష్టపోయిన ప్రతి రైతుని 3 నెలల తర్వాత తానే ఆదుకుంటానని అన్నారు. అలాగే కౌలు రైతులకు సైతం పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత తానే తీసుకుంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఉప్పొంగిన కొండవీటి వాగు - చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
Chandrababu Visit Tenali Constituency Farmers:మంగళగిరి నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని తెనాలి నియోజకవర్గం నందివెలుగులో దెబ్బతిన్న పంటపొలాల్ని చంద్రబాబు పరిశీలించారు. పొలాల్లోకి దిగి నీట మునిగిన పంటను స్వయంగా పరిశీలించారు. తుపాను వల్ల పూర్తిగా నష్టపోయామని రైతులు చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. మూడు నెలల తర్వాత ఏపీలో తెలంగాణ పరిస్థితే వస్తుందని అన్నారు. మానవ తప్పిదం వల్లే రైతులు తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్నిస్తే, తనలాంటి వాళ్లని కూడా జైల్లో పెడతారని విమర్శించారు. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్లు తెలిపారు.
ముందస్తు చర్యలతో నష్ట నివారణ చర్యలకు ఎన్నో అవకాశాలు ఉన్నా ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతుల్ని చూస్తే గుండె తరుక్కుపోతోందని కరవు వల్ల సగంమంది పంట కూడా వేయలేదని అన్నారు. పంట వేసిన వారంతా తుపాను వల్ల నష్టపోయారని పేర్కొన్నారు. దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల పాలైంది మన రాష్ట్రంలోనేనని ధ్వజమెత్తారు. పట్టిసీమ నీరు ముందుగా వదిలి ఉంటే ఈపాటికి రైతులు పంటల్ని కాపాడుకుని ఉండేవారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తన షెడ్యూల్ ఖరారైతే కానీ ముఖ్యమంత్రిలో కదలిక రాలేదని అన్నారు.
నడుము లోతు నీటిలో మునిగిన వరి పైరు - అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు
Chandrababu Indirect Comments on Telangana Elections:తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉంది. అహంకారం ఉంటే ఏమవుతుందనేది తెలంగాణలో ఇప్పటికే చూశామని, ఇప్పుడు మరో మూడు నెలల్లో ఏపీలో కూడా చూస్తాం అని అన్నారు.