AP High Court Hear on Chandrababu Petition:అంగళ్లు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తెలుగుదేశం అధినేత ముందస్తు బెయిల్ పిటిషన్లపై భోజన విరామం అనంతరం తిరిగి విచారణ ప్రారంభించిన హైకోర్టు.. అంగళ్లు కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును సోమవారం వరకు అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది.
Lokesh CID Enquiry Questions: సీఐడీ విచారణకు లోకేశ్.. ప్రశ్నలు అడిగేందుకు అధికారుల తర్జనభర్జనలు..
అంగళ్లు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు షెడ్యూల్ ప్రకారం ఉదయమే న్యాయమూర్తి ఎదుటకు రాగా.. హైకోర్టు విచారణ చేపట్టింది. అంగళ్లు కేసులోచంద్రబాబును అరెస్టుచేయాల్సి ఉంటుందని... అసలు ఆ ఘటన జరగడానికి ఆయన వ్యాఖ్యలే కారణమని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. అమరావతి రింగ్ రోడ్డు కేసులోనూ చంద్రబాబును కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉంటుందన్నారు. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు... ఆయన విచారణకు సహకరిస్తారన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ద్వారా ఆయన్నుఅరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. దీంతో సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు స్పష్టం చేసింది. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల తర్వాత హైకోర్టు తిరిగి ఈ కేసులు విచారణ చేపట్టింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందన్న అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్...ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్నారు. చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్… ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అనంతరం కోర్టు విచారణ వాయిదా పడింది. భోజన విరామం అనంతరం విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.