తెలంగాణ

telangana

హైదరాబాద్‌ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయింది - సైకో పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి : చంద్రబాబు

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 1:05 PM IST

Updated : Jan 7, 2024, 4:42 PM IST

Chandrababu Participate in Ra Kadali Ra: జగన్‌ రివర్స్‌ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువూరులో జరిగిన 'రా కదలి రా' బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. పక్కనున్న హైదరాబాద్​ వెలిగిపోతుంటే, జగన్​ తీరుతో అమరావతి వెలవెలబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu Participate in Ra Kadali Ra
Chandrababu Participate in Ra Kadali Ra

Chandrababu Participate in Ra Kadali Ra:తిరువూరులో జరుగుతున్న 'రా కదలి రా' బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సభకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సభలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వ వైఫాల్యాలను చంద్రబాబు ప్రజలకు వివరించారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ప్రాజెక్టుల నిర్మాణాలకు చరమగీతం పాడారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్​ ప్రభుత్వ హయంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని మండిపడ్డారు.

తిరువూరు చేరుకున్న చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం - జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రా కదిలి రా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు, తెలంగాణా సరిహద్దు కావటంతో ఖమ్మం జిల్లా నుంచి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ నగరం, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల నుంచి భారీ వాహన ర్యాలీలు నిర్వహించారు.

హైదరాబాద్‌ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయింది - సైకో పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి : చంద్రబాబు

యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం:'బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ 'పేరుతో సూపర్‌ సిక్స్‌ అందిస్తామని చంద్రబాబు అన్నారు. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు 3 వేల రూపాయల భృతి అందిస్తామని వెల్లడించారు. 'అన్నదాత' కింద రైతులకు 20 వేలు అందిస్తామని, 'జయహో బీసీ' కింద ప్రత్యేక చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తామన్నారు.

కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైంది - వచ్చే ఎన్నికల్లో పాండవులదే గెలుపు

టీడీపీ - జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో తీసుకువస్తామని ప్రకటించారు. జగన్‌ ఎమ్మెల్యేలను నమ్మట్లేదని, ప్రజలు జగన్‌ను నమ్మట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసిన వారికి వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ సీట్లు ఇవ్వడంలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే వైసీపీ నాయకులు ఇంట్లో నుంచి బయటకు రాలేరని పేర్కొన్నారు. ఏపీ హేట్స్ జగన్ అని రాష్ట్రమంతా నినదిస్తోందని తెలిపారు.

టీడీపీని దూషిస్తేనే సీట్లు: ఎమ్మెల్యేలను బదిలీ చేసిన సందర్భాలు గతంలో లేవని, రాష్ట్రాలను లూటీచేసి ప్రజలను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ఎంపీ టికెట్‌ ఇస్తానని అంబటి రాయుడ్ని మోసగించారని దుయ్యబట్టారు. గుంటూరు ఎంపీ టికెట్‌ వేరొకరికి ఇవ్వడంతో రాయుడు వెనుదిరిగారన్నారు. చంద్రబాబు, లోకేశ్​, పవన్‌ను దూషిస్తేనే అభ్యర్థులకు పార్టీ టికెట్లు ఇస్తున్నారని వివరించారు.

తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయ స్థాయికి:సంక్షేమ పథకాలకు నాంది పలికిందే తెలుగుదేశం పార్టీ అని వివరించారు. జగన్‌ పాలనలో వంద సంక్షేమ పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు. ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌ వన్‌గా ఉండాలనేది తన ఆకాంక్ష అని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుందన్నారు. తెలుగుజాతి గ్లోబల్‌ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడిందని వెల్లడించారు. జగన్‌ రివర్స్‌ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని విమర్శించారు.

ఏటా జాబ్ క్యాలెండర్‌ విడుదల చేసి యువత జీవితానికి బంగారుబాట వేస్తా: చంద్రబాబు

దుర్మార్గుడు పాలిస్తే కొలుకోలేని దెబ్బ : హైదరాబాద్‌ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు 'రా.. కదలి రా' అని పిలుపునిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అసమర్థుడు ఉంటే రాష్ట్రం కొంతవరకు నష్టపోతుందని, దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో నిద్రలేని కాలరాత్రులు గడిపినట్లు తెలిపారు. అరాచక పాలనకు చరమగీతం పాడాలని చంద్రబాబు వెల్లడించారు.

రైతుల బాగుకోసం టీడీపీ - జనసేన రావాలి: వైెస్సార్​సీపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కాదు కదా, కాలువల్లో పూడిక కూడా తీయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖను మూసేశారని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం రైతులు దగాపడ్డారని మండిపడ్డారు. రాష్ట్ర రైతులు అప్పుల్లో అగ్రస్థానంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలురైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని, పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని దుయ్యబట్టారు. రైతుల బతుకులు బాగుపడాలంటే టీడీపీ - జనసేన ప్రభుత్వం రావాలని, సైతాన్‌ ప్రభుత్వం పోవాలన్నారు. రైతే రాజుగా మారాలని వివరించారు. మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి ఉన్న పేరు, ప్రతిష్టలను జగన్‌ నాశనం చేశారు: అచ్చెన్నాయుడు

కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్​ లిస్టులో పెట్టే పరిస్థితి : పోలవరం పూర్తయితే ప్రతి ఎకరాకు నీరందేదని వెల్లడించారు. డబ్బులు చెల్లించనందున కాంట్రాక్టర్లు పనులు చేయలేని పరిస్థితి నెలకొందని వివరించారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్‌ లిస్టులో పెట్టే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

యువతను నెంబర్​1 గా : రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు వస్తే, ఇప్పటి జగన్‌ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో గంజాయి తీసుకువచ్చారన్నారు. ప్రజల భవిష్యత్తుకు తను గ్యారంటీ ఇస్తానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర యువతను ప్రపంచంలో నంబర్‌ వన్‌గా మారుస్తానని చంద్రబాబు తెలిపారు. జాతికి పెద్ద ఆస్తి యువత కన్నెర్ర చేస్తే ఎవరూ బాగుపడరని స్పష్టం చేశారు.

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు - పార్టీ కండువా కప్పి స్వాగతించిన చంద్రబాబు

ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల బతుకులు బాగుపడలేదు : దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తానని అనుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్​సీపీ ఆటలు సాగవని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల జీవితాలు ఏమీ బాగుపడలేదని వివరించారు. ఐదేళ్లు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని, రుషికొండను బోడిగుండు చేసి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్‌ కట్టారని ఆరోపించారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని వివరించారు. రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు : తెలుగుదేశం సభకు వస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు తిరువూరుకు మూడు కిలోమీటర్లు అవతలే అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు ఇలా అడ్డుకోవడం వివాదాస్పదమయ్యింది. పోలీసుల తీరుపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు సైన్యం సైతం తెగువ చూపి పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా సభాస్థలికి దూసుకెళ్లారు.

రాష్ట్రానికి జగన్‌ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయి: చంద్రబాబు

Last Updated : Jan 7, 2024, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details