Chandrababu Naidu House Custody Petition: చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సోమవారం నుంచి మొదలైన విచారణ.. ఈ రోజు ముగిశాయి. కోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. పిటిషన్‌ను తిరస్కరించింది. చంద్రబాబు హౌస్ అరెస్టు పిటిషన్‌పై సోమవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. చంద్రబాబు హౌస్ అరెస్టు పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకోనున్న వేళ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులు సోమవారం సుదీర్ఘ వాదనలు వినిపించారు. మెుదట జైలులో చంద్రబాబు భద్రతపై అనుమానాలున్నాయని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఏసీబీ కోర్టుకు సమర్పించి హౌస్ అరెస్టు అనుతించాలని, న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టును కోరారు. సీఐడీ తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
Arguments on Chandrababu House Custody Petition in ACB Court:తెలుగుదేశం అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సోమవారం సుదీర్ఘ వాదనలు పూర్తయ్యాయి. జైల్లో చంద్రబాబుకు భద్రత కల్పించే అంశం పైనే అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు తరపు న్యాయవాది లూద్రా కోర్టుకు తెలిపారు. కరడు గట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన నేరస్థులు అదే జైల్లో నే ఉన్నారని లూద్రా పేర్కొన్నారు. సెక్యూరిటీ థ్రెట్ ను అనుసరించే ఎన్ఎస్జి లాంటి భద్రత కల్పించారని చంద్రబాబు తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీ కి సంబధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని సుప్రీం కోర్టు న్యాయవాది లుద్రా కోర్టుకు విన్నవించారు. గౌతం నవర్కర్ కేసులో హౌజ్ రిమాండ్ కు సుప్రీం కోర్టు అనుమతించిందనీ పేర్కొన్నారు.