తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Chandrababu Initiation in Rajamahendravaram Jail: 'సత్యమేవ జయతే' పేరిట జైలులో చంద్రబాబు.. బయట భువనేశ్వరి దీక్షలు

Chandrababu Initiation in Rajamahendravaram Jail: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అక్రమ అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు నిరశన దీక్ష చేపట్టనున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమహేంద్రవరం క్వారీ సెంటర్‌ వద్ద దీక్షకు కూర్చోనున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ బస్సుయాత్రకు సైతం శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్న భువనేశ్వరి త్వరలో దీనిపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

chandrababu_initiation
chandrababu_initiation

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 7:14 AM IST

Chandrababu Initiation in Rajamahendravaram Jail: 'సత్యమేవ జయతే' పేరిట జైలులో చంద్రబాబు.. బయట భువనేశ్వరి దీక్షలు

Chandrababu Initiation in Rajamahendravaram Jail:నైపుణ్యాభివృద్ధి కేసులో(Skill Development Case) అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో నేడు నిరశన దీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఆయన అక్రమ అరెస్టును నిరసిస్తూ.. జనహితం కోరుతూ రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరశన దీక్ష(Bhuvaneshwari Nirashana Diksha) చేపట్టనున్నారు. తమకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో గాంధీ జయంతి రోజున ‘సత్యమేవ జయతే ’ పేరిట చేపట్టనున్న ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్‌ నాయకుల పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.

TDP Leaders Visit skill Development Centers: కళ్లముందే 'స్కిల్' శిక్షణ కేంద్రాలు.. వైసీపీ నేతలవి నిరాధార ఆరోపణలు : టీడీపీ

రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం నియోజకవర్గాల నుంచి సుమారు 8 వేల మంది మహిళలు హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ మేరకు క్వారీ సెంటర్‌ సమీపంలోని సుమారు 4 ఎకరాల స్థలంలో రెండున్నర ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. బస చేసిన కేంద్రం నుంచి భువనేశ్వరి ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సమీపంలోని జాతిపిత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి క్వారీ సెంటర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలికి 10 గంటలకు చేరుకుని ‘సత్యమేవ జయతే ’ దీక్షలో సాయంత్రం 5 గంటల వరకు కూర్చుంటారు.

TDP Leader Somireddy Fire On Minister Kakani Govardhan Reddy: మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అనుచరుల ఆగడాలు.. టీడీపీ శ్రేణులపై దాడులు

రాజమహేంద్రవరంలో మే నెలలో మహానాడు నిర్వహించినప్పుడు వేదిక సిద్ధం చేసిన బృందం పర్యవేక్షణలోనే.. ప్రస్తుత సభా వేదిక ఏర్పాట్లు శరవేగంగా చేపట్టారు. ఆదివారం ఉదయం వేదిక ఖరారైన వెంటనే పార్టీ జిల్లా నాయకులు పరిశీలించి, ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దీక్షకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నిలిపి ఉంచేందుకు వేదిక సమీపంలో పార్కింగ్‌ స్థలాలు ఏర్పాట్లు చేశారు. పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

TDP KE Krishnamurthy on Chandrababu Arrest: 'సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును జైల్లో పెట్టడం కన్నీరు తెప్పిస్తోంది'

చంద్రబాబు అక్రమ అరెస్టుకు(Chandrababu Arrest) నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి బస్సుయాత్ర(Bhubaneswari Bus Yatra) చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5న కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి కోర్టుల్లో వెలువడే ఉత్తర్వులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 5వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమైతే మొదట రాయలసీమ జిల్లాల్లో కొనసాగనుంది. చంద్రబాబు అరెస్టు నాటి నుంచి భువనేశ్వరి రాజమహేంద్రవరంలోనే ఉంటూ పోరాటం చేస్తున్నారు. వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్న కార్యక్రమాలకు హాజరై కార్యకర్తలకు నైతిక స్థైర్యం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details