Chandrababu Illness In Jail: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. గత కొన్ని రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఆరోగ్యంపై అటు కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు కూడా లేకుండా పొయింది. గతంలోనే జైల్లో తనకు డిహైడ్రేషన్ అయినట్లు చంద్రబాబు తెలిపినా.. జైలు అధికారులు ఎలాంటి చర్యలు చెపట్టలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా.. రాజమండ్రిలో ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో ఎండ వేడిమి, ఉక్కపోత వల్ల చంద్రబాబుకు అలర్జీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకూ.. చంద్రబాబు అధికారులతో ఈ విషయాన్ని తెలియజేశారు.
వెంటనే తేరుకున్న జైలు అధికారులు చంద్రబాబు వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రికి సమాచారం అందించారు. ఆయనకు చికిత్స అందించేందుకూ... వైద్యులు రాజమహేంద్రవరంలోని జైలుకు వెళ్లి చంద్రబాబును పరిశీలించారు. జీజీహెచ్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జైలుకి వెళ్లి చంద్రబాబును పరీక్షించారు. 6 గంటల 30 నిమిషాలకు వారు బయటకు వచ్చారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించగా వారు మాట్లాడేందుకు నిరాకరించారు.
చంద్రబాబు చేయి, ఛాతీ, గడ్డంపైనా దద్దుర్లు ఏర్పడినట్లు తెలిసింది. జైలు ఇంఛార్జ్ పర్యవేక్షకుడు రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా.. చంద్రబాబుకు చర్మ సంబంధిత అలర్జీ రావడంతో వైద్య నిపుణులకు చూపించామన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు సూచించిన మందులు అందజేస్తామని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని ఆందోళన అవసరం లేదంటూ.. ఓ బులిటెన్ విడుదల చేశారు.
Lokesh meets Amit Shah: రాజకీయ కక్షతో పెట్టిన కేసులు.. నిజం వైపు ఉండాలని అమిత్‌షాను కోరా: లోకేశ్
రాజమహేంద్రవరంలో కొద్దిరోజులుగా తీవ్రమైన వేడి, ఉక్కబోత వల్ల చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు ఇటీవల తెలిపారు. ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును మంగళవారం జైలులో కలిశారు. చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురైన విషయాన్ని వారే వెల్లడించారు. చంద్రబాబు నీరసంగా ఉన్నారని, ముఖం లాగేసినట్లు కనిపించారంటూ తన తల్లి చెప్పినట్లు లోకేశ్ బుధవారం చెప్పారు.