Chandrababu Followers Highly Crowd on Roads: రోడ్లతో నిండిపోయిన అభిమానం.. ఎక్కడ చూసినా సంబరాలే.. Chandrababu Followers Highly Crowd on Roads: రహదారులు కిక్కిరిశాయి, జంక్షన్లు జామయ్యాయి. భావోద్వేగాలు పెల్లుబికాయి. జనం జేజేలు మహిళల హారతులు.. కాన్వాయ్ వెంట అభిమానుల పరుగులు.. ఇలా రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని నివాసం వరకూ.. అడుగడుగునా స్వాగత నీరాజనమే.! జైలు గది నుంచి జనంలోకి అడుగు పెట్టిన చంద్రబాబు అభిమాన సంద్రాన్ని దాటుకుని.. ఇల్లు చేరడానికి దాదాపు 13 గంటలు పట్టింది.
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు కార్యకర్తలు, అభిమానల నీరాజనాల నడుమ.. ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చిన బాబు మనువడు దేవాన్ష్‌ను హత్తుకున్నారు. అప్పటికే జైలు బయట వేచి ఉన్న బాలకృష్ణ చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాల్లోని పూజా ఫలాన్ని అందించారు.
Chandrababu Released from Rajahmundry Central Jail: రాజమండ్రి తరలివచ్చిన అభిమాన జనతరంగం.. చంద్రబాబును చూసి ఆనందపారవశ్యం
అచ్చెన్నాయుడు చంద్రబాబును చూసి కన్నీరు పెట్టుకోగా చంద్రబాబు ఆలింగనం చేసుకుని సముదాయించారు. అలా భావోద్వేగాల నడుమ విజయవాడ బయల్దేరిన చంద్రబాబుకు.. తెలుగుదేశం కార్యకర్తలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.
52రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న తమ అధినేతను చూసేందుకు ప్రజలు ఎక్కడికక్కడే రోడ్లపైకి తరలివచ్చారు. కాన్వాయ్‌కు ఎదురెళ్లి చంద్రబాబుకు విజయ సంకేతం చూపించారు. కొందరు భావోద్వేగంతో దండాలు పెట్టారు. వారందికీ అభివాదం చేస్తూ చంద్రబాబు వాహన శ్రేణి ముందుకుసాగింది.
Chandrababu Receives an Extraordinary Welcome: వేలాదిగా రోడ్లపైకి జనం.. చంద్రబాబుకు ఘన స్వాగతం
రాజమహేంద్రవరం కారాగారం నుంచి.. ఒకటిన్నర కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు రెండుగంటల సమయం పట్టింది. దారిపొడవునా ప్రజాభిమానం పోటెత్తింది. అభిమానులు కాన్వాయ్‌పై పూలవర్షం కురిపించారు. దారిపొడవునా కార్యకర్తలు బాణసంచా కాల్చారు. కొన్నిచోట్ల గజమాలలతో ఆహ్వానం పలికారు.
వేమగిరి, రావులపాలెం, పెరవరి, తణుకు, తాడేపల్లి గూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ మీదుగా చంద్రబాబు కాన్వాయ్ జనజాతరను తలపించింది. ఊరూరా ప్రజలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. కొన్నిచోట్ల ట్రాక్టర్లలో తరలివచ్చారు. చంద్రబాబును దగ్గరగా చూసేందుకు పోటీపడ్డారు. వారిని అదుపుచేయడానికి పోలీసులు.. అష్టకష్టాలు పడ్డారు.
Bhuvaneshwari Emotional Tweet on Chandrababu Bail: '53 రోజులు ఎంతో వేదన చెందా.. క్షణమొక యుగంలా గడిచింది..'
పొద్దుపోయినా ప్రజాభిమానం చెక్కు చెదరలేదు. మహిళలు కూడా రోడ్డుకు ఇరువైపులా నిలుచుని చంద్రబాబు రాకకోసం నిరీక్షించారు. అధినేతకు అభివాదం చేశాకే వెళ్లారు. కోర్టు ఆంక్షల దృష్ట్యా చంద్రబాబు ఎక్కడా వాహనం నుంచి బయటకు దిగలేదు. అద్దంలో నుంచే కార్యకర్తలకు అభివాదం చేశారు. మార్గం మధ్యలోని ఒక్కో కూడలి దాటేందుకు బాబు కాన్వాయ్‌కు.. దాదాపు 20 నిమిషాలు పట్టింది.
చంద్రబాబుకు తెలుగుతమ్ముళ్లతోపాటు జనసైనికులూ స్వాగతం పలికారు. కొలహలు, సంబరాల మధ్య జనసైనికులు టీడీపీ అధినేతకు ఆహ్వానం పలికారు. ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబు అభిమానులు రాత్రంతా పడిగాపులు కాశారు. చంద్రబాబు రావడానికి ఆలస్యం కావడంతో.. రాత్రంతా చలిలో రోడ్డు పక్కనే నిద్రించారు. ముందే పూలు సిద్ధం చేసుకున్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ గాల్లోకి కండువాలు తిప్పుతూ నృత్యాలు చేశారు.
Chandrababu Release from Jail: 'జై చంద్రబాబు' నినాదాలతో మార్మోగిన రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాలు