Chandrababu Family Members Mulakat: రాజమహేంద్రవరం కారాగారంలో చంద్రబాబు భద్రతపై.. ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరిలు చంద్రబాబుతో దాదాపు అరగంటపాటు ములాఖత్ అయ్యారు. కుటుంబం కన్నా రాష్ట్రాభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబును అన్యాయంగా జైలులో వేశారని.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో నారా భువనేశ్వరి మాట్లాడుతూ..జైలులో చంద్రబాబు భద్రతపై తనకు భయంగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Nara Bhuvaneshwari comments: ''చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించేవారు. ప్రజలే తనకు ముఖ్యమని ఆయన ఎప్పుడూ అనేవారు. ప్రజల హక్కుల కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. తాను బాగున్నానని..ఏమీ భయపడవద్దని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన చెప్పారు. కానీ, చంద్రబాబు భద్రతపై నాకు భయంగా ఉంది. జైలు నుంచి బయటకు వచ్చి ప్రజా సేవ చేస్తానని అన్నారు. మా కుటుంబం ఎప్పుడూ ప్రజలు, క్యాడర్ కోసం నిలుస్తుంది. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఇది. ఏమీ కాదు. ప్రజలే తనకు ముఖ్యమని ఎప్పుడూ అనేవారు. మన రాష్ట్రం.. దేశంలో నెంబర్‌వన్‌గా ఉండాలని చంద్రబాబు అనేవారు. మా కుటుంబ సభ్యులకు ఇది చాలా కష్టకాలం. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుకు అండగా ఉండాలి.'' అని చంద్రబాబు సతీమణిభువనేశ్వరి అన్నారు.
chandrababu Family Members Reached Central Jail: రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు
Chandrababu Constantly Worked for the People and the State: 'కుటుంబం గురించి మీకు బాధ్యత లేదా..?' అని ఆయనను తాను పలుసార్లు ప్రశ్నిస్తే.. ప్రజల బాగోగులే తనకు ముఖ్యమని చంద్రబాబు అన్నారని భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రస్తుతం తమ కుటుంబానికి ఇది ఎంతో క్లిష్ట సమయమని ఆమె గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఏమీ కాదు, చంద్రబాబు భార్యగా, ఎన్టీఆర్ కూతురిగా తాను పార్టీ శ్రేణులకు హామీ ఇస్తున్నానన్న భువనేశ్వరి.. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగానే ఉన్నారని, పార్టీ శ్రేణులు ఎవ్వరూ బాధ పడొద్దని ఆమె అన్నారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసమే చంద్రబాబు నిరంతరంగా పనిచేశారని ఆమె వెల్లడించారు. చంద్రబాబు కట్టిన జైలులోనే ఆయన్ను కట్టిపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును వీడి బయటకు వస్తుంటే నా మనస్సు చలించిందని ఆమె ఆవేదనకు గురయ్యారు. ఆయన కోసం తన అత్మను వదలేసి వచ్చానన్నారు. పార్టీ కోసం క్యాడర్ పని చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తాను ఊహించలేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, అందరూ ధైర్యంగా ఉండాలన్నారు. 'ఆయన భద్రతపై మాకు భయంగా ఉంది. చన్నీళ్ల స్నానం చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి చాలా దారుణం. ఈ పరిస్థితి మాకు ఒక సవాల్' అని నారా భువనేశ్వరి తీవ్ర ఆవేదన చెందారు.
Doubts on Chandrababu security : జైలు లోపలి దృశ్యాలు బయటకు... సూపరింటెండెంట్ బదిలీ యత్నాలు.. ఈ చర్యలు దేనికి సంకేతం...?
Nandamuri Family Members Meet With Lokesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. ములాఖత్‌లో భాగంగా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి... దాదాపు అరగంటపాటు చంద్రబాబుతో మాట్లాడారు. మరోవైపు రాజమహేంద్రవరంలోని క్యాంపు సైట్‌లో నందమూరి కుటుంబ సభ్యులు లోకేశ్‌ను కలిసి ధైర్యం చెప్పారు. నందమూరి రామకృష్ణ, శ్రీభరత్, తేజశ్విని, నారా రోహిత్ సహా పలువురు లోకేశ్‌తో సమావేశమయ్యారు. అక్రమ తమ మనోధైర్యాన్ని దేబ్బతీయలేవని తేల్చిచెప్పారు.
Chandrababu will Come out With a clean chit: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ పెట్టిన అక్రమ కేసులు.. తెలుగుదేశం శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలేవని నందమూరి, నారా కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని తామంతా ఒక్కరికొకరం అండగా ఉంటూ.. పార్టీని ముందుడి నడిపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు చంద్రబాబు క్లీన్‌చిట్‌తో బయటకు వస్తారన్నారు.
చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు