తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రబాబు కంటికి ఆపరేషన్ పూర్తి - క్యాటరాక్ట్‌ చికిత్స చేసిన ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్య నిపుణులు - Asian Institute of Gastroenterology

Chandrababu Eye Operation Completed: చంద్రబాబు నాయుడు కంటికి హైదరాబాద్​లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో క్యాటరాక్ట్ ఆపరేషన్ పూర్తి అయింది. ఈ రోజు ఉదయం ఆస్పత్రిలో జాయిన్ అయిన చంద్రబాబుకు వైద్యులు ఆపరేషన్ చేశారు.

Chandrababu_Eye_Operation_Completed
Chandrababu_Eye_Operation_Completed

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 5:08 PM IST

Chandrababu Eye Operation Completed: తెలుగదేశం అధినేత చంద్రబాబుకు ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యులు క్యాటరాక్ట్‌ ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే రెండు సార్లు గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నాలుగు రోజులు క్రితం AIGకి వచ్చిన చంద్రబాబు... ఒకరోజు అక్కడే ఉండి పలు వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి వెళ్లారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు వైద్యుల బృందం వివిధ వైద్య పరీక్షలు చేయడంతో పాటు చర్మ సంబంధిత చికిత్స అందించారు.

నవంబర్ 2వ తేదీన చంద్రబాబు మొదటి సారి ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఒక రోజు పాటు అక్కడే ఉన్నారు. ఆయనకు వైద్యులు పలు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం నవంబర్ 3వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి వైద్యులు చంద్రబాబుకు పలు పరీక్షలు చేశారు.

ఏఐజీ ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి - కుడి కంటికి ఆపరేషన్ అవసరమన్న నేత్ర వైద్యులు

ఏఐజీ (Asian Institute of Gastroenterology) ఆస్పత్రిలో జరిగిన వైద్య పరీక్షలు సమయంలో నారా భువనేశ్వరి సైతం ఆయన వెంట ఉన్నారు. పరీక్షలు అనంతరం.. అయన జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లారు. ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు.. గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్‌ కె. రాజేష్‌ ఆధ్వర్యంలో జనరల్‌ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం వివిధ వైద్య పరీక్షలు సూచించారు. రక్త, మూత్ర పరీక్షలు, 2డీ ఎకో, అలర్జీ స్క్రీనింగ్‌, ఈసీజీ, కాలేయ, మూత్రపిండాల పనితీరు, ఇతర టెస్టులు చేసినట్లు తెలుస్తోంది.

స్కిల్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తీవ్ర అలర్జీ, అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో స్కిల్​ కేసులో మధ్యంతర బెయిల్‌ రావడంతో.. చంద్రబాబు హైదరాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి.. వివిధ పరీక్షలు చేసుకున్నారు. అదే విధంగా సోమవారం రోజు కూడా మరోసారి చంద్రబాబు ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు వైద్యుల బృందం వివిధ వైద్య పరీక్షలు చేయడంతో పాటు చర్మ సంబంధిత చికిత్స అందించినట్లు సమాచారం.

రేపు చంద్రబాబు కంటికి ఆపరేషన్​ - ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. గతంలో చంద్రబాబు కంటికి వైద్యం చేసిన హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వైద్యులు.. చంద్రబాబుకు ఉన్న కంటి సమస్యలు, చేయాల్సిన చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఓ రిపోర్టులో వివరించారు.

కంటిలో శుక్లాలు ఏర్పడ్డాయని.. ఎడమ, కుడి కంటి చూపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉందని.. 3 నెలల్లో కుడి కంటికి సర్జరీ చేయాలని సూచించారు. అదే విధంగా జైలులో చర్మ సంబంధ సమస్యలు చంద్రబాబు నాయుడుని తీవ్రంగా బాధించాయి. ఈ నేపథ్యంలో బెయిల్​పై విడుదలైన చంద్రబాబుకు నేడు క్యాటరాక్ట్‌ చికిత్స కోసం ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు ఆపరేషన్ చేశారు.

Chandrababu Interim Bail in Skill Development Case: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌

ABOUT THE AUTHOR

...view details