తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Chandrababu Case Arguments in ACB Court: పోలీసులు నన్ను మానసికంగా వేధించారు.. వాహనంలో తిప్పుతూనే ఉన్నారు - Protests by TDP leaders in AP

Arguments of Chandrababu Case in ACB Court: పోలీసులు మానసికంగా వేధించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదివారం రోజు కోర్టుకు తెలిపారు. ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని ఆ తర్వాత వాహనంలో తిప్పుతూనే ఉన్నారని న్యాయాధికారికి వాంగ్మూలం ఇచ్చారు.

chandrababu_case_arguments_in_acb_court
chandrababu_case_arguments_in_acb_court

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 7:38 AM IST

Chandrababu Case Arguments in ACB Court:నైపుణ్యాభివృద్ధి (Skill Development Case) కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన కేసులో చంద్రబాబును అరెస్ట్ (Chandrababu Arrested) చేసిన సీఐడీ (CID) పోలీసులు ఆదివారం ఉదయం విజయవాడలోని అనిశా కోర్టులో (Anisha Court) హాజరుపరిచినప్పుడు న్యాయాధికారి హిమబిందు ఎదుట ఆయన వాంగ్మూలమిచ్చారు. ఈ వివరాలు.. చంద్రబాబును రిమాండ్‌కు(Chandrababu Remand) పంపుతూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉన్నాయి. సీఐడీ కస్టడీలో పోలీసులు మానసికంగా వేధించారని, ఆదివారం ఉదయం 8 గంటల వరకూ రోడ్లపై వాహనంలో తిప్పుతూనే ఉన్నారని అనిశా కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు చెప్పారు.

CID Filed Two Petitions Against Chandrababu: చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో సీఐడీ రెండు పిటిషన్లు

Medical Tests for Chandrababu:పోలీసులు తనను ఇంటరాగేట్ చేస్తున్న దృశ్యాలను దురుదేశపూర్వకంగా ప్రత్యక్ష ప్రసారం చేయించారని, ఆ అధికారం వారికి లేదన్నారు. సీఐడీ కస్టడీలో ఉండగా తనకు మొదట ఒక వైద్యుడు పరీక్షలు చేశారని, తర్వాత విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. (Chandrababu Health condition) తనకు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు పెరిగినట్లు పరీక్షల్లో తేలిందన్నారు.

Arguments Between Chandrababu and Judge:ఏ సమయంలో అరెస్ట్ చేశారన్న న్యాయాధికారి ప్రశ్నకు నేను బస చేసిన ప్రదేశాన్ని శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి పోలీసులు ముట్టడించారని చంద్రబాబు తెలిపారు. శనివారం తెల్లవారు జామున ఐదు-ఐదున్నర గంటల సమయంలో సీఐడీ డీఐజీ (CID DIG) రఘురామిరెడ్డి, కేసు దర్యాప్తు అధికారి ధనుంజయ్ తన దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నారని చెప్పారు. వారి రాకకు కారణమేంటని అడిగితే అరెస్ట్ నోటీసు అందించారని కేసు వివరాలు అడిగితే సమాధానం చెప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు.

Woman Got Job due to Skill Development Corporation: చంద్రబాబు మచ్చలేని మనిషి.. మా కోచింగ్ ఖర్చు తిరిగి ఇచ్చేందుకు సిద్ధం: భావన

Chandrababu Statement:పోలీసులు దురుసుగా ప్రవర్తించారా? అన్న ప్రశ్నకు 'శారీరకంగా ఇబ్బంది పెట్టలేదుగానీ మానసికంగా వేధిస్తూనే ఉన్నారు' చంద్రబాబు బదులిచ్చారు. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు ఇచ్చారా? అన్న ప్రశ్నకు మొదట ఎఫ్ఐఆర్ (FIR) అరెస్ట్ నోటీసులే ఇచ్చారని తెలిపారు. కోర్టులో హాజరుపరచడానికి కొంచెం ముందు మాత్రమే రిమాండ్ నోటీసు అందించారని వాంగ్మూలంలో చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండానే తనను అరెస్ట్ చేశారని, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు అధికారి కాకపోయినా సీఐడీ డీఐజీ తనను ఇంటరాగేట్ చేశారని, ఆ అధికారం ఆయనకు లేదని చంద్రబాబు అన్నారు.

Mamata On Chandrababu Arrest : 'తప్పు జరిగితే విచారణ చేయండి.. కానీ ప్రతీకారం పనికి రాదు!'.. చంద్రబాబు అరెస్ట్​పై మమత కామెంట్స్​

Police Attitude Towards Chandrababu:నంద్యాలలో చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో వెళ్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాత్రికిరాత్రే పోలీసులు వ్యూహాత్మకంగా చేరుకున్నారు. రాత్రే అనంతపురం నుంచి అదనపు బలగాలను నంద్యాలకు రప్పించారు. చంద్రబాబు బస చేసిన బస్సు చుట్టూ రోప్ ఏర్పాటు చేశారు. తమ చర్యలకు అడ్డంకులు లేకుండా చేసుకున్న పోలీసులు అడ్డుపెట్టిన తెలుగుదేశం వాహనాలను జేసీబీతో తొలగించారు. తెలుగుదేశం కార్యకర్తలు, మీడియా బృందాలను బయటకు పంపారు. చంద్రబాబు బస్సు వద్ద ఉన్న నాయకులను అదుపులోకి తీసుకొని పోలీసు వాహనాల్లో తరలించారు.

ABOUT THE AUTHOR

...view details