తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Chandrababu Bail Celebrations in Telangana : చంద్రబాబుకు బెయిల్.. తెలంగాణలో టీడీపీ శ్రేణుల సంబురాలు - రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సంబురాలు

Chandrababu Bail Celebrations in Telangana : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విడుదలయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన.. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో 52 రోజుల తర్వాత బయటికొచ్చారు. దీంతో తెలంగాణలో టీడీపీ మద్దతుదారులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Chandrababu Released From Jail
Chandrababu Bail Celebrations in Telangana

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 8:38 AM IST

Chandrababu Bail Celebrations in Telangana బాబుకు బెయిల్.. తెలంగాణలో టీడీపీ శ్రేణుల సంబరాలు..

Chandrababu Bail Celebrations in Telangana : రాజమహేంద్రవరం జైలు నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్‌పై బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా.. ఆయన అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తమ అభిమాన నేత కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వచ్చారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు.

TDP Chief Chandrababu Naidu Comments: 'నేను ఏ తప్పూ చేయలేదు.. ప్రజల అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను'

Chandrababu Released From Jail : రోజుల నిరీక్షణ తర్వాత టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయిడు రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చారు. దీంతో తెలంగాణలో టీడీపీ మద్దతుదారులు, అభిమానులు.. రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్‌, కోకాపేట్‌, మూవీ టవర్స్‌ వద్ద పెద్దఎత్తున టపాసులు పేల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నిజం గెలిచిందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కోకాపేట్‌లో మూవీ టవర్స్‌ వచ్చిందంటే అది బాబు పుణ్యమేనని గుర్తుచేశారు. అక్రమ అరెస్టులు, కేసులు బనాయించడం తప్పా ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి శూన్యమని తెలిపారు.

కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, కుత్బుల్లాపూర్‌, తదితర ప్రాంతాల్లో మిఠాయిలు పంచుకున్నారు. చేయని తప్పుకు బాబును బాధ్యుడిని చేసి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ మద్దతుదారులు మండిపడ్డారు. ఎన్టీఆర్‌ భవన్‌ ఎదుట బాణా సంచా కాలుస్తూ ఆనందోత్సవాలతో..చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబుకు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాత ఏపీ సర్కారు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఉద్ధృతం చేస్తారని తెలంగాణ టీడీపీ నేతలు తెలిపారు. ఓయూలో చంద్రబాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 10,116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. భువనేశ్వరి చేపట్టిన యాత్రతో నిజం గెలిచిందని.. అధికారం అడ్డం పెట్టుకొని వ్యవస్థలను ఎన్నో రోజులు నియంత్రణ చేయలేరని స్పష్టం చేశారు.

Chandrababu Interim Bail in Skill Development Case: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌

Chandrababu Bail Celebrations :చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో టీడీపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చారు. మచ్చలేని చంద్రబాబును అరెస్ట్ చేసి రాజకీయ వేధింపులకు గురి చేయటం బాధాకరమని వెంకట వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం టీడీపీ కార్యాలయంలో సంబురాలు అంబరాన్నంటాయి. తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ చంద్రబాబు జిందాబాద్‌లు కొట్టారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వచ్చి సంబురాల్లో పాల్గొన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయాన్ని ప్రజల గుమ్మం వద్దకు తీసుకెళ్లిన చంద్రబాబును జగన్ సర్కారు 53రోజులు నిర్భదించిందని టీడీపీ అభిమానులు మండిపడ్డారు. చంద్రబాబునాయుడు ఆయురారోగ్యాలతో బయటకు రావాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటికైనా చెడుపై మంచి గెలుస్తుందని పునరుద్ఘాటించారు.

Chandrababu Released from Rajahmundry Central Jail: రాజమండ్రి తరలివచ్చిన అభిమాన జనతరంగం.. చంద్రబాబును చూసి ఆనందపారవశ్యం

TDP Leaders Celebrations in Hyderabad : చంద్రబాబుకు బెయిల్.. హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తలు, అభిమానుల సంబురాలు

ABOUT THE AUTHOR

...view details