తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైఎస్సార్సీపీకి కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయ్యింది - రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి : చంద్రబాబు - pawan kalyan bhogi celebrations

Chandrababu and Pawan Kalyan Participate in Bhogi Celebrations: "తెలుగుజాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం" పేరిట భోగి మంటల కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో భారీగా సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు చేశారు. జగన్ సర్కారుకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయ్యిందని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 9:28 AM IST

Updated : Jan 14, 2024, 12:07 PM IST

వైఎస్సార్సీపీకి కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయ్యింది - రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి : చంద్రబాబు

Chandrababu and Pawan Kalyan Participate in Bhogi Celebrations :"తెలుగుజాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం" పేరిట భోగి మంటల కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో భారీగా సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు గంగిరెద్దులు, సంక్రాంతి ముగ్గులు, పొంగళ్లతో రాజధాని రైతులు, తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భోగి మంటలను ఇద్దరు నేతలు కలిసి వెలిగించారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను చంద్రబాబు, పవన్ భోగి మంటల్లో తగలపెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాజధాని గ్రామాల ప్రజలు, ఇరు పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు, పవన్‌ మాట్లాడారు.

87 రోజుల పాటు ఒకే బాటలో పయనించాలి :వైఎస్సార్సీపీ ప్రభుత్వ అసమర్థ, విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రైతులను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేశారని. ఈ ఐదు సంవత్సారాలు వారికి చీకటి రోజులని చెప్పారు. జగన్ సర్కారుకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయ్యిందని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారని విమర్శలు చేశారు. ఇవాళ పండుగేమో భోగి పాలకుడేమో మానసిక రోగి అని ఆయన వ్యాఖ్యానించారు. శుభగడియలు తలుపు తడుతున్నాయని వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం ఈరోజు నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

నేడు సంక్రాంతికి "పల్లె పిలుస్తుంది రా కదలి రా" కార్యక్రమం - పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఉపాధి కల్పించే బాధ్యత మాది :మన రాజధాని అమరావతే, ఇది ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సంపద సృష్టించే కేంద్రంగా, సంక్షేమ పాలన అందించేందుకు ఉపయోగపడుతుందని, జగన్‌కు కూల్చడమే తెలుసు నిర్మించడం తెలియదని ఎద్దేవా చేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రైతుల పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. 32 రోజులుగా అంగన్వాడీలు పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ పూట కూడా వారిని రోడ్డుపై ఉండేలా చేశారని అన్నారు. వైసీపీ పాలనలో రైతులు చాలా కష్టాలు పడ్డారని, గిట్టుబాటు ధర లేదని, తుపాను వచ్చి నష్టపోయినా జగన్ వారిని పట్టించుకోలేదని ఆరోపించారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని, భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యతను టీడీపీ, జనసేన తీసుకుంటాయని చంద్రబాబు ప్రకటించారు.

పండగ వేళ అంగన్వాడీల ఆకలి 'మంటలు' - ప్రభుత్వం ఉద్యోగాల తొలగించినా తిరిగి ఉద్యోగాలిస్తామని లోకేశ్ హామీ

బంగారు రాజధాని నిర్మించుకుందాం : వైఎస్సార్సీపీ పాలనతో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం దగ్గరలో ఉందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజధాని రైతులను దారుణంగా కొట్టి వేధించిన ఘటన నన్ను కలచి వేసిందని, రైతుల సంకల్పం నెరవేరుతుందని అన్నారు. బంగారు రాజధాని నిర్మించుకుందాం. ఇది కేవలం అమరావతి సమస్య కాదని, 5కోట్ల మంది ప్రజలదని తెలిపారు. రైతుల కష్టం రేపు శ్రీకాకుళం, పులివెందులలోనూ వస్తుందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు, నిరుద్యోగులనూ జగన్ మోసం చేశారని ఆయన నిప్పులు చెరిగారు.

బంగారు రాజధాని నిర్మించుకుందాం: పవన్‌ కల్యాణ్‌

సంక్రాంతి ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్​లు- సొంతూళ్లకు వెళ్లేందుకు అవస్థలు

Last Updated : Jan 14, 2024, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details