Janasena Pawan Meet TDP Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్లోని ఆయన నివాసంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. తెలుగుదేశం-జనసేన పార్టీల పొత్తు ప్రక్రియను వేగవంతం చేయడంపైనే ఇరువురు నేతలు సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. నవంబర్ 4వ తేదీన ఇదే తరహాలో చంద్రబాబు-పవన్ నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండా ఎగురవేస్తా: పవన్ కల్యాణ్
జిల్లా, నియోజకవర్గాల స్థాయిల్లో ఇరుపార్టీలూ సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించుకోవడం, ఉమ్మడి మినీ మేనిఫెస్టో ప్రకటించడం వంటి పరిణామాలు గత నెలరోజుల్లో వేగంగా చోటుచేసుకున్నాయి. తాజా భేటీలో సీట్ల కేటాయింపు అంశం చర్చకు వచ్చిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. చంద్రబాబు-పవన్ కల్యాణ్ ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తారని ఇప్పటికే ఇరుపార్టీల నేతలూ ప్రకటించినందున ఆ దిశగా ఇరువురు అధినేతల మధ్య చర్చ జరిగి ఉండొచ్చని తెలుస్తోంది.
తేలుకుట్టిన దొంగలా దాక్కున్న విజయసాయిరెడ్డి - విచారణకు హాజరైతే బండారం బట్టబయలు : టీడీపీ
రాష్ట్రంలో ఓటమి భయంతో వైసీపీ ఓట్ల అక్రమాలకు పాల్పడుతోందనే అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న తెలుగుదేశం దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని యోచిస్తోంది. ఆ దిశగా ఐక్యపోరాటంపై చంద్రబాబు-పవన్ మధ్య చర్చ జరిగి ఉండవచ్చని సమాచారం.
బీసీల బాంధవుడు చంద్రన్న, బీసీల వెన్ను విరుస్తున్న జగనన్న-టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు