తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Live Updates: రెండోరోజు ముగిసిన లోకేశ్ విచారణ.. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో విచారించిన సీఐడీ - చంద్రబాబు కేసులపై విచారణ లేటెస్ట్ లైవ్అప్డేట్స్

Chandrababu_and_Lokesh_Cases_in_ACB_and_High_Court_Live_Updates
Chandrababu_and_Lokesh_Cases_in_ACB_and_High_Court_Live_Updates

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 10:16 AM IST

Updated : Oct 11, 2023, 5:31 PM IST

17:28 October 11

ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తే క్విడ్‌ప్రోకో ఎలా అవుతుంది..?: లోకేశ్

  • లింగమనేని రమేశ్​కు రెంటల్‌ అడ్వాన్స్‌ రూ.27 లక్షలు కట్టారని చెప్పారు: లోకేశ్
  • రెంటల్‌ అడ్వాన్స్‌కు సంబంధించి ఐటీ రిటర్న్‌ల్లో లేదని చెప్పారు: లోకేశ్
  • ఐటీ రిటర్న్‌లకు సంబంధించి ఆడిటర్‌ను అడగాలని చెప్పా: లోకేశ్
  • ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తే క్విడ్‌ప్రోకో ఎలా అవుతుంది..?: లోకేశ్
  • వాలంటీర్లు సాక్షి పత్రిక కొనాలని చెప్పారు.. ఇది నిజం కాదా?: లోకేశ్
  • అందుకే జగన్‌, భారతిరెడ్డికి దిల్లీ హైకోర్టు నోటీసు ఇచ్చింది: లోకేశ్

17:23 October 11

ఐఆర్‌ఆర్‌లో నాకు, కుటుంబసభ్యులకు ఎలాంటి పాత్ర లేదు: లోకేశ్

  • హెరిటేజ్‌ కొనుగోలు చేసిన 9 ఎకరాలు గూగుల్‌ ఎర్త్‌లో చూపించారు: లోకేశ్
  • ఐఆర్‌ఆర్‌ వల్ల హెరిటేజ్‌ భూములు కోల్పోయినట్లు చూపించారు: లోకేశ్
  • ఐఆర్‌ఆర్‌లో నాకు, కుటుంబసభ్యులకు ఎలాంటి పాత్ర లేదు: లోకేశ్
  • పదేళ్లుగా కుటుంబసభ్యుల ఆస్తులు ప్రజల ముందుంచుతున్నా: లోకేశ్
  • గజం ఎక్కువున్నట్లు నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా అని చెప్పా: లోకేశ్
  • స్కిల్‌ కేసులో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు: లోకేశ్
  • స్కిల్‌ కేసులో సంతకాలు పెట్టిన ఇద్దరు అధికారులను విచారించట్లేదు: లోకేశ్
  • ప్రేమ్‌ చంద్రారెడ్డి, అజేయ కల్లంను ఎందుకు విచారించట్లేదు: లోకేశ్
  • పాలసీ ఫ్రేమ్‌ చేసిన చంద్రబాబును మాత్రం రిమాండ్‌కు పంపారు: లోకేశ్

17:18 October 11

నిన్నటి ప్రశ్నలనే అటు తిప్పి ఇటు తిప్పి మళ్లీ మళ్లీ అడిగారు: లోకేశ్

  • నిన్న 41ఏ ఇచ్చి ఇవాళ మళ్లీ విచారణకు రావాలని కోరారు: లోకేశ్
  • ఏపీ హైకోర్టు ఒక్కరోజు విచారణకు హాజరుకావాలని చెప్పింది: లోకేశ్
  • సీఐడీ అధికారుల నోటీసు మేరకు విచారణకు వచ్చాను: లోకేశ్
  • ఆరు గంటలపాటు సీఐడీ అధికారులు విచారించారు: లోకేశ్
  • నిన్నటి ప్రశ్నలనే అటు తిప్పి ఇటు తిప్పి మళ్లీ మళ్లీ అడిగారు: లోకేశ్
  • ఇవాళ నా ముందు ఒక డాక్యుమెంట్‌ పెట్టారు: లోకేశ్
  • భువనేశ్వరి ఐటీ రిటర్న్‌లకు సంబంధించి డాక్యుమెంట్‌ పెట్టారు: లోకేశ్
  • భువనేశ్వరి ఐటీ రిటర్న్‌లు మీ వద్దకు ఎలా వచ్చాయని అడిగా: లోకేశ్
  • ఐటీ రిటర్న్‌లకు సంబంధించి సమాధానం దాటవేశారు: లోకేశ్
  • ఐఆర్‌ఆర్‌కు సంబంధించి నాలుగైదు ప్రశ్నలు అడిగారు: లోకేశ్
  • నా శాఖకు సంబంధించి పలు ప్రశ్నలు పదేపదే అడిగారు: లోకేశ్
  • ఈ కేసులో మరోసారి ఏమైనా లేఖ ఇస్తారా అని అడిగా..: లోకేశ్
  • నేను అడిగిన ప్రశ్నకు ఏమీ సమాధానం చెప్పలేదు: లోకేశ్

17:15 October 11

రెండోరోజు ముగిసిన లోకేశ్ సీఐడీ విచారణ

  • రెండోరోజు ముగిసిన లోకేశ్ సీఐడీ విచారణ
  • ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో లోకేశ్​ను విచారించిన సీఐడీ

16:59 October 11

హైకోర్టు ఆదేశాలతో ఐఆర్‌ఆర్‌ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ వాయిదా

  • ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన రైట్‌ టు ఆడియన్స్‌ పిటిషన్‌ డిస్మిస్‌
  • హైకోర్టు ఆదేశాలతో ఐఆర్‌ఆర్‌ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ వాయిదా
  • ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పిటిషన్‌పై సీఐడీ న్యాయవాది వివేకా వాదనలు
  • కేసు వివరాలు, ఎందరిని అరెస్టు చేశారనేది జడ్జికి తెలిపిన సీఐడీ న్యాయవాది

16:01 October 11

హైకోర్టు ఆదేశాలతో ఐఆర్‌ఆర్‌ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ వాయిదా

  • ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన రైట్‌ టు ఆడియన్స్‌ పిటిషన్‌ డిస్మిస్‌
  • విజయవాడ: కాసేపట్లో ఫైబర్‌నెట్ కేసులో వాదనలు విననున్న న్యాయాధికారి
  • హైకోర్టు ఆదేశాలతో ఐఆర్‌ఆర్‌ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ వాయిదా

15:55 October 11

ఇన్నర్ రింగ్​రోడ్డు కేసులో ముగిసిన పునీత్ సీఐడీ విచారణ..

  • ముగిసిన పునీత్ సీఐడీ విచారణ
  • ఐఆర్ఆర్ కేసులో ఉదయం సీఐడీ విచారణకు హాజరైన పునీత్

14:46 October 11

చంద్రబాబుకు హైకోర్టులో ఊరట

  • అంగళ్లు, ఐఆర్‌ఆర్‌ కేసుల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • అంగళ్లు కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయవద్దని ఉత్తర్వులు
  • ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబును సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ఉత్తర్వులు
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్లపై స్టే ఇచ్చిన హైకోర్టు
  • ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు కోరిన సీఐడీ
  • ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లపై హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు
  • అంగళ్లు కేసులో రేపటిదాకా అరెస్టు, పీటీవారెంట్‌ అడగము అని హైకోర్టుకు పోలీసుల హామీ

14:14 October 11

భోజన విరామం తర్వాత హైకోర్టులో కొనసాగనున్న వాదనలు

  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణకు విరామం
  • భోజన విరామం తర్వాత హైకోర్టులో కొనసాగనున్న వాదనలు
  • ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందన్న ఏజీ శ్రీరామ్‌
  • ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్న ఏజీ శ్రీరామ్‌
  • చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఆయన తరఫు న్యాయవాది
  • చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన దమ్మాలపాటి శ్రీనివాస్‌

14:10 October 11

చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న న్యాయవాదులు

  • చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ
  • రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు సహకరిస్తామన్న చంద్రబాబు న్యాయవాదులు
  • చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న న్యాయవాదులు
  • సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోరిన కోర్టు
  • మధ్యాహ్నం 2.30 తర్వాత మళ్లీ విచారిస్తామన్న హైకోర్టు

11:42 October 11

చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న న్యాయవాది దమ్మాలపాటి

  • చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
  • రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు సహకరిస్తామన్న చంద్రబాబు న్యాయవాదులు
  • చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న న్యాయవాదులు
  • సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోరిన కోర్టు
  • పిటిషన్లపై మధ్యాహ్నం విచారణ చేపడతామన్న హైకోర్టు

11:19 October 11

మధ్యాహ్నం 12 గం.కు విచారిస్తామన్న హైకోర్టు

  • చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో కాసేపట్లో విచారణ
  • మధ్యాహ్నం 12 గం.కు విచారిస్తామన్న హైకోర్టు
  • రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

10:15 October 11

అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ విచారణకు హాజరైన లోకేశ్

  • అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ విచారణకు హాజరైన లోకేశ్
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ప్రశ్నించాలని హైకోర్టు ఆదేశం

10:15 October 11

ఇవాళ సీఐడీ విచారణకు హాజరుకానున్న నారాయణ అల్లుడు పునీత్‌

  • ఇవాళ సీఐడీ విచారణకు హాజరుకానున్న నారాయణ అల్లుడు పునీత్‌
  • ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రశ్నించాలన్న హైకోర్టు
  • పునీత్‌ను న్యాయవాది సమక్షంలోనే ప్రశ్నించాలని ఆదేశించిన హైకోర్టు
  • రింగ్‌రోడ్డు కేసులో విచారణకు హాజరుకావాలని ఈ నెల 6న సీఐడీ నోటీసులు
  • హైకోర్టు ఆదేశాలతో ఇవాళ సీఐడీ విచారణకు హాజరుకానున్న పునీత్‌

09:42 October 11

రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

  • చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ
  • రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

09:41 October 11

చంద్రబాబుపై దాఖలు చేసిన పీటీ వారెంట్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

  • చంద్రబాబుపై దాఖలు చేసిన పీటీ వారెంట్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
  • రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్ కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేసిన సీఐడీ
  • పీటీ వారెంట్లపై మధ్యాహ్న భోజన విరామం తర్వాత జరగనున్న విచారణ

09:40 October 11

నిన్న సీఐడీ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పిన నారా లోకేశ్

  • రింగ్ రోడ్డు కేసులో నేడు కూడా సీఐడీ విచారణకు హాజరుకానున్న లోకేశ్
  • నిన్న సీఐడీ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పిన నారా లోకేశ్
  • రింగ్‌రోడ్డుపై కాకుండా హెరిటేజ్‌పైనే ఎక్కువ ప్రశ్నలు అడిగారన్న లోకేశ్
  • మిగిలిన ప్రశ్నలకూ నిన్నే సమాధానం చెబుతానన్నా ఒప్పుకోని సీఐడీ
  • ప్రశ్నలు తయారుచేసుకోవాల్సి ఉన్నందున నేడూ విచారణకు రావాలన్న సీఐడీ
  • నిన్న విచారణ ముగిశాక మళ్లీ 41-ఎ నోటీసు ఇచ్చి ఇవాళ రమ్మన్న సీఐడీ
  • ఉదయం 10 గం.కు సీఐడీ విచారణకు వెళ్లనున్న నారా లోకేశ్

09:38 October 11

నేడు మరోసారి సీఐడీ విచారణకు హాజరుకానున్న లోకేశ్

  • నేడు మరోసారి సీఐడీ విచారణకు హాజరుకానున్న లోకేశ్
  • ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నిన్న లోకేశ్​ను విచారించిన సీఐడీ
  • నిన్న లోకేశ్​ను ఆరున్నర గంటలపాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
  • మరోసారి విచారణకు రావాలని నిన్నలోకేశ్​కు సీఐడీ నోటీసులు
  • విచారణకు రావాలని 41ఏ నోటీసులు ఇచ్చారన్న లోకేశ్

09:31 October 11

Live Updates: రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

  • Live Updates: రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
  • నిన్న లంచ్ మోషన్ పిటిషన్‌ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
  • బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ వాదనలు వింటామన్న హైకోర్టు
Last Updated : Oct 11, 2023, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details