తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తీరం దాటిన 'యాస్' తుపాను- గాలుల బీభత్సం - 'యాస్'​ తుపాను

Cyclone Yaas
యాస్ తుపాను

By

Published : May 26, 2021, 8:50 AM IST

Updated : May 26, 2021, 4:50 PM IST

16:42 May 26

అతితీవ్ర తుపాను 'యాస్'.. తీరం దాటింది. ఉదయం 9 గంటలకు ఒడిశాలోని ధామ్రా వద్ద తీరాన్ని తాకిన తుపాను.. బాలేశ్వర్​కు 20 కిలోమీటర్ల దూరంలో తీరం దాటినట్లు వాతావరణ విభాగం తెలిపింది.  

తీరాన్ని తాకే సమయంలో ఒడిశా, బంగాల్​ తీర ప్రాంత జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. భీకర గాలులు, భారీ వర్షాలకు పలు ప్రాంతాలు వణికిపోయాయి. గంటకు 130 నుంచి నుంచి 155 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులు ఒడిశాలోని భద్రక్ జిల్లాను అతలాకుతలం చేశాయి. బంగాల్‌లోనూ ప్రచండ గాలులు, జోరు వానలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

11:55 May 26

  • ఒడిశాలోని ధామ్రా వద్ద తీరాన్ని తాకిన యాస్‌ తుపాను
  • మరికొద్ది గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాల్ మధ్య తీరం దాటే అవకాశం
  • ఒడిశా, పశ్చిమ బంగాల్‌పై యాస్‌ తుపాను ప్రభావం
  • ఒడిశాలోని భద్రక్‌ జిల్లాలో అధికంగా తుపాను ప్రభావం
  • ఒడిశాలోని ధమ్రా, పారాదీప్ ప్రాంతాల్లో భారీ వర్షం
  • చాందీపూర్‌, బాలాసోర్‌ ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం
  • బంగాల్‌లోని దిగా తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు
  • బంగాల్‌లోని దిగా వద్ద రోడ్డుపైకి ఉప్పొంగుతున్న సముద్రపు నీరు
  • 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు
  • తుపాను దృష్ట్యా ఒడిశా, బంగాల్‌కు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
  • బంగాల్‌లో మోహరించిన 74 వేల మంది సిబ్బంది, 2 లక్షల మంది పోలీసులు
  • రేపు సా. 5 గంటల వరకు భువనేశ్వర్‌ విమానాశ్రయం మూసివేత
  • ఝార్ఖండ్, బిహార్, అసోం, మేఘాలయాలోనూ వర్షాలు కురిసే అవకాశం

11:05 May 26

చెట్టుకూలి ఇద్దరు మృతి

చెట్టు కూలి ఇద్దరు మృతి.. 

ఆనంద్​పుర్, బాలేశ్వర్​లో యాస్ తుపాను తీవ్ర రూపం దాల్చుతోంది. ఆనంద్​పుర్, బాలేశ్వర్​లో చెట్టు కూలి ఇద్దరు మృతి చెందారు. గాయపడ్డ మరో వ్యక్తిని ఆనంద్​పుర్​లోని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. 

10:25 May 26

మరో మూడు గంటలు.. 

యాస్​ తుపాను ప్రభావం మరో 3-4 గంటలపాటు కొనసాగుతుందని ఒడిశా విపత్తు నిర్వహణ కమిషనర్ పీకే జానా తెలిపారు. ధమ్రా, బాలేశ్వర్​​ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. 

09:31 May 26

తుపాను ఉద్ధృతి.. 

బంగాల్​లో యాస్​ తుపాను తీవ్రరూపం దాల్చుతోంది. తూర్పు మిడ్నాపుర్​ దగ్గర సముద్రం నీరు నివాసిత ప్రాంతాలకు చేరుకుంది. 

08:52 May 26

తీవ్ర వర్షపాతం..

యాస్ తుపాను ప్రభావంతో భద్రక్​ జిల్లాలోని ధమ్రా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 

08:10 May 26

యాస్ తుపాను : చెట్టు కూలి ఇద్దరు మృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను యాస్​.. తీరానికి చేరువైంది. బుధవారం మధ్యాహ్నం ఒడిశాలోని బాలాసోర్​ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. యాస్​ తుపాను.. ఒడిశాలోని  ధామ్రాకు 60 కి.మీ.ల దూరంలో, పారదీప్​కు 90కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది.

ఆ రాష్ట్రంలోని బాలాసోర్​కు 105 కి.మీల దూరంలో, బంగాల్ దిఘాకు 240 కి.మీల దూరంలో ఉన్నట్లు చెప్పింది. 

Last Updated : May 26, 2021, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details