తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వయసు ఆరుపదులు.. 67 చోరీ కేసుల్లో నిందితులు!

Chandigarh woman thieves: చండీగఢ్​లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వృద్ధ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 16 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిపై 67 వివిధ కేసులు ఉన్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

Chandigarh woman thieves
ఛండీగఢ్​లో మహిళా దొంగలు అరెస్టు

By

Published : Apr 18, 2022, 10:28 PM IST

Chandigarh woman thieves: దొంగతనం కేసులో ఇద్దరు వృద్ధ మహిళలను చండీగఢ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితులను 65 ఏళ్ల సత్య అలియాస్ ప్రీతి, 70 ఏళ్ల గుర్మీత్​ అలియాస్​ లచ్చిమిగా గుర్తించారు. వారి చోర కలను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. దొంగతనాలు, చైన్​ స్నాచింగ్‌లు, మోసాలకు పాల్పడిన వీరిపై 65కుపైగా కేసులు ఉన్నాయని తెలిపారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి విధించింది.

పంజాబ్‌లోని నవాన్‌షహర్‌లోని శివాల్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న సుర్జిత్ కౌర్ (54) ఏప్రిల్ 13న తన భర్త అమర్జీత్ సింగ్‌తో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి బయలుదేరింది. అప్పుడు పీజీఐ బస్టాండ్​ వద్ద ఆమె మెడలో ఉన్న బంగారు బ్రాస్లెట్ దొంగిలించారు ఈ వృద్ధ మహిళలు. సుర్జిత్ కౌర్​ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించి మహిళా దొంగలు సత్య, గుర్మీత్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు మహిళా దొంగల నుంచి 16 గ్రాముల బంగారు కంకణం, కట్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కౌర్ తన భర్తతో కలిసి పీజీఐ బస్ స్టాప్ నుంచి బస్సు ఎక్కినప్పుడు బ్రాస్‌లెట్ దొంగిలించినట్లు అంగీకరించారు. దొంగలిద్దరిపై చండీగఢ్‌లో పలు కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఒక నిందితురాలైన గుర్మీత్​పై మొత్తం 33 స్నాచింగ్, చీటింగ్, దొంగతనం, డ్రగ్స్ చలామణి ఉండగా, మరో నిందితురాలు సత్య అలియాస్ ప్రీతోపై 34 కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:ఏడాదిన్నర చిన్నారిపై 40ఏళ్ల వ్యక్తి అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details