Chandigarh MC polls: పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) సత్తా చాటింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో 14 స్థానాల్లో ఆప్ గెలుపొందింది. శుక్రవారం ఎన్నికలు జరగగా సోమవారం కౌంటింగ్ నిర్వహించారు.
చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 35 స్థానాలు ఉండగా.. ఆప్ 14 స్థానాల్లో గెలుపొందింది. భాజపా 12 స్థానాలు, కాంగ్రెస్ 8 స్థానాలకు పరిమితమయ్యాయి. శిరోమణి అకాలీ దళ్ 1 స్థానంలో గెలుపొందింది. చండీగఢ్ సిట్టింగ్ మేయర్ రవికాంత్ శర్మ(భాజపా)ను 828 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి దమన్‌ప్రీత్ సింగ్ ఓడించారు.
మాజీ మేయర్, భాజపా అభ్యర్థి దావేశ్ మౌడ్గిల్‌ను ఆప్ అభ్యర్థి 939 ఓట్ల తేడాతో జస్బీర్ ఓడించారు.
'మార్పునకు సంకేతం'
Aap in punjab: చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయంపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో మార్పునకు ఇది సంకేతం అని పేర్కొన్నారు.