తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిడ్డను ఎత్తుకుని విధుల్లో మహిళా కానిస్టేబుల్​​​ - నడిరోడ్డుపై బిడ్డతో మహిళా పోలీస్​

ఎండలో, నడిరోడ్డుపై ఓ మహిళా కానిస్టేబుల్ తన​ బిడ్డను భుజానికెత్తుకుని విధులు నిర్వర్తిస్తున్న వీడియో.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. పంజాబ్​లోని ఛండీగఢ్​లో జరిగిన ఈ సంఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

Chandigarh cop takes baby to work, video goes viral
వైరల్​: బిడ్డను ఎత్తుకుని విధుల్లో మహిళా పోలీస్​​

By

Published : Mar 7, 2021, 10:01 AM IST

పంజాబ్​ ఛండీగఢ్​లో ఓ మహిళా కానిస్టేబుల్​.. తన చిన్నారిని ఎత్తుకుని విధులు నిర్వర్తించారు. ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. విధుల పట్ల ఆమెకు ఉన్న అంకిత భావాన్ని కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొంత మంది మాత్రం పోలీసు శాఖలో మహిళలు పని చేసేందుకు ఉన్న కఠిన పరిస్థితులను ప్రశ్నిస్తున్నారు.

వైరల్​: బిడ్డను ఎత్తుకుని విధుల్లో మహిళా పోలీస్​​

ఈ ఘటనపై ఛండీగఢ్​ పోలీసులను ఈటీవీ భారత్​వివరణ కోరింది. ఆ మహిళా కానిస్టేబుల్​ పేరు ప్రియాంక అని పోలీసులు తెలిపారు. ఉదయం 8 గంటలకు ఆమె విధుల్లో పాల్గొనాల్సి ఉండగా.. హాజరుకాలేదని చెప్పారు. ఆలస్యానికి గల కారణాలు అడగటం వల్ల ఆమె వాగ్వాదానికి దిగారని, అనంతరం తన పాపతో కలిసి విధులకు వచ్చారని వివరించారు.

మహిళా పోలీసుల పిల్లల కోసం తమ శాఖలో ప్రత్యేక విభాగం ఉందని ఛండీగఢ్​ పోలీసులు తెలిపారు. అక్కడ వారికోసం పుస్తకాలు, ఆటవస్తువులు సహా అన్ని రకాల వసతులు ఉన్నాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య- కారణమేంటి?

ABOUT THE AUTHOR

...view details