తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేరుకు ప్రైవేటు స్కూల్.. ఫీజు మాత్రం ఏడాదికి రూ.500! - కర్ణాటక ఛామరాజనగర్​ వార్తలు

తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తూ కర్ణాటకలోని దీనబంధు స్కూల్​ ఆదర్శంగా నిలుస్తోంది. భారీ మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్న పాఠశాలలకు భిన్నంగా యాజమాన్యం ఈ పాఠశాలను నిర్వహిస్తోంది.

deenabandhu school chamarajanagar
ఈ బడిలో రూ.1000కే ఉన్నత చదువులు!

By

Published : Jul 19, 2021, 7:57 AM IST

ఈ బడిలో రూ.1000కే ఉన్నత చదువులు!

ప్రైవేటు పాఠశాలలు అంటేనే భారీ స్థాయిలో ఫీజుల వసూళ్లకు పెట్టింది పేరు. కరోనా వచ్చాక పాఠశాలలు మూతపడి ఆన్​లైన్​లోనే క్లాసులు ప్రారంభమైనా.. వారి ఫీజులో ఎలాంటి మార్పు లేదు. అయితే కర్ణాటకలోని ఓ పాఠశాల మాత్రం తక్కువ ఫీజుకే పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తోంది.

ఛామరాజనగర్​ జిల్లా రామసముద్రలోని ఉన్న దీనబంధు పాఠశాల గత కొన్నేళ్లగా మిగతా స్కూళ్లతో పోలిస్తే అతి తక్కువ ఫీజుతో పిల్లలకు విద్య అందిస్తోంది. ఈ స్కూల్​లో ఏడాదికి.. ఎల్​కేజీ, యూకేజీలకు రూ.500, ఒకటి నుంచి నాలుగో తరగతి వారికి రూ.750, ఐదు నుంచి ఏడవ తరగతి వారికి రూ.1250 ఫీజుగా తీసుకుంటున్నారు. ఎనిమిది నుంచి పది తరగతుల వారికి ఫీజు రూ.1750గా ఉంది. మూడేళ్ల నుంచి ఫీజులు పెంచకుండానే విద్యార్థులకు చదువు చెబుతున్నారు.

ఈ బడిలో రూ.1000కే ఉన్నత చదువులు!

ఫీజును విడతల వారీగా చెల్లించే అవకాశాన్ని కూడా యాజమాన్యం కల్పిస్తోంది. ఈ రుసుమును తల్లదండ్రులు.. రెండు లేదా మూడు విడతల్లో కట్టవచ్చు.

"ఈ పాఠశాలలో చేరే విద్యార్థులలో ప్రధానంగా వారి ఆర్థిక పరిస్థితి గమనిస్తాము. ఇక్కడున్న 95 శాతం మంది విద్యార్థులు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారే. కరోనా మా పాఠశాల నిర్వహణపైన ఎలాంటి ప్రభావం చూపించలేదు. స్టాఫ్​, టీచర్ల జీతాల్లో ఎప్పుడూ కోత విధించలేదు. వారికి జీతాలు ఇవ్వడంలో ఎప్పుడు ఆలస్యం కాలేదు. దాతలు అందిస్తున్న సాయానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను."

-ప్రకాశ్, హెడ్​మాస్టర్​

దీనబంధు స్కూల్​ను ప్రముఖ కన్నడ కవి జీఎస్​ శివరుద్రప్ప కుమారుడు జయదేవ్​ 1999లో ప్రారంభించారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ పాఠశాలను స్థాపించారు. ఇందులో యాజమాన్యం అనాథ విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోంది. విద్యార్థులకు ఈ స్కూల్ మధ్యాహ్న భోజనం కూడా అందిస్తుంది. ఈ ఏడాది 430 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్చుకున్నారు. ఏటా ఓ తరగతిలో 35 మంది విద్యార్థులకే యాజమాన్యం అడ్మిషన్లు ఇస్తుంది.

ఈ బడిలో రూ.1000కే ఉన్నత చదువులు!

తమకు దగ్గర్లో ఇలాంటి స్కూల్​ ఉన్నందుకు గర్వంగా ఉందంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

"మాకు సమీపాన ఇలాంటి పాఠశాల ఉన్నందుకు గర్వపడుతున్నాము. ఇక్కడ వీళ్లు విద్యార్థులకు తక్కువ ఫీజుకే నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో లభించే ఉన్నతమైన విద్య మా పిల్లలకు అందుతోంది."

-అనిత, విద్యార్థి తల్లి

ఈ పాఠశాల నిర్వహణకు దాతలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. 2014 నుంచి ఇండో-ఎంఐఎం కార్పొరేషన్ వ్యవస్థాపకులు డాక్టర్​ కృష్ణ చివుకుల, జగదాంబ చివుకుల దంపతులు ఈ స్కూల్​కు అండగా నిలుస్తున్నారు . ఈ పాఠశాలలో సైన్స్​ పార్క్​, సైన్స్​ మ్యూజియం, లాబొరేటరీ మొదలైనవి ఉన్నాయి. ఇవి ప్రయోగాత్మక విద్యా విధానానికి తోడ్పడుతున్నాయి.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details