Woman Commits Suicide With Child: ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. నందానగర్కు చెందిన ఓ మహిళ తన 14 నెలల శిశువును గొంతు నులిమి చంపి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. వీపుపై పాపతో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలోనూ విచారణ చేపట్టారు. దీంతో శవపరీక్ష నివేదిక కోసం వేచిచూస్తున్నారు పోలీసులు. తల్లి, శిశువు ఇద్దరు మరణించడం వల్ల గ్రామమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.
14నెలల పాపను చంపి.. వీపుపై కట్టుకుని.. చెట్టుకు ఉరేసుకున్న తల్లి! - ఉత్తరాఖండ్ న్యూస్
Woman Commits Suicide With Child: ఓ మహిళ తన 14 నెలల శిశువును గొంతు నులిమి చంపి.. ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీపుపై చిన్నారితో చెట్టుకు వేలాడిన ఈ హృదయవిదారక ఘటన ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది: చమోలి జిల్లా సర్పాణి గ్రామానికి చెందిన అనీషాకు సుఖ్వీర్కుమార్తో ప్రేమ వివాహం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఇంటిపనులు పూర్తిచేసుకున్న అనీషా.. అత్తకు ఆహారం ఇచ్చి శిశువుతో పాటు పొలానికి వెళ్లింది. రాత్రి అయినా అనీషా ఇంటికి రాకపోవడం వల్ల సమీపంలోని తల్లి ఇంటికి వెళ్లిందని భావించారు. అక్కడికి రాలేదని తెలియడం వల్ల వెతకడం ప్రారంభించారు. చీకటి పడటం వల్ల గాలించడం ఆపారు. తిరిగి ఉదయం అనీషా జాడ కోసం వెతుకుతుండగా గ్రామంలోని చెట్టుకు శవమై కనిపించింది. ఆమె తన శిశువును వీపుపై చీరతో కట్టుకుని వేలాడుతూ కనిపించింది. అయితే గ్రామంలోని ఓ మహిళతో అనీషాకు గొడవ జరిగిందని గ్రామస్థులు అంటున్నారు. వీరి మరణానికి అదే కారణమా అని ఆలోచిస్తున్నారు.
ఇదీ చదవండి:పార్లర్ ముసుగులో 'సెక్స్ రాకెట్'.. ఏడుగురు అరెస్ట్!